Ram Charan: వారసుడి రాకతో మెగా ఇంట సంబరాలు.. ఫ్యాన్స్‌కు రామ్ చరణ్ సర్పైజ్ గిఫ్ట్!

Ram Charan: వారసుడి రాకతో  మెగా ఇంట సంబరాలు.. ఫ్యాన్స్‌కు రామ్ చరణ్ సర్పైజ్ గిఫ్ట్!

మెగాస్టార్ చిరంజీవి ఇంట ప్రస్తుతం పండుగ వాతావరణం నెలకొంది. ఇటీవల రామ్ చరణ్ సతీమణి ఉపాసనకు కవల పిల్లలు జన్మించారు. కొణిదెల కుటుంబంలోకి కొత్త సభ్యుల రాకతో మెగా అభిమానుల సంబరాలు అంబరాన్ని తాకాయి. గత ఏడాది క్లీంకార రాకతో మురిసిపోయిన ఈ దంపతులకు, ఇప్పుడు ట్విన్స్ జన్మించారనే వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ అద్భుతమైన క్షణాలను మెగా ఫ్యామిలీ తమ ఆత్మీయులు, అభిమానులతో పంచుకుంటూ రెట్టింపు ఉత్సాహంతో ఉంది.

అభిమానులకు మెగా సర్ప్రైజ్!

ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని రామ్ చరణ్ - ఉపాసన దంపతులు తమ అభిమానులకు ఒక ప్రత్యేకమైన కానుకను పంపించారు. మెగా వారసుల రాకను సెలబ్రేట్ చేసుకుంటూ, అపోలో సంస్థ తరపున అభిమానులకు అందమైన గిఫ్ట్ బాక్స్‌లను పంపిణీ చేశారు. ఈ గిఫ్ట్ బాక్స్‌లో నోరూరించే రెండు రకాల స్వీట్స్ ఉండగా, దానిపై చరణ్-ఉపాసనల నుండి ప్రత్యేక సందేశం కూడా ఉంది. ఒక అభిమాని ఈ గిఫ్ట్ బాక్స్‌ను అన్‌బాక్సింగ్ చేస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తోంది.మా ఆనందంలో అభిమానులను భాగం చేయడం చాలా సంతోషంగా ఉంది అంటూ చరణ్ దంపతులు తమ కృతజ్ఞతను చాటుకున్నారు. మెగా ఫ్యాన్స్ సైతం మా అన్నయ్య మనసు బంగారం అంటూ కామెంట్లతో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు.

బాక్సాఫీస్ వద్ద వేట రెడీ

ఒకవైపు వ్యక్తిగత జీవితంలో ఇంతటి సంతోషం ఉన్నప్పటికీ, చరణ్ తన వృత్తిపరమైన బాధ్యతల్లోనూ దూసుకుపోతున్నారు. 'ఉప్పెన' చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేసిన బుచ్చిబాబు సనా దర్శకత్వంలో 'పెద్ది' చిత్రంలో నటిస్తున్నారు. ఇది ఒక పీరియడ్ విలేజ్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కనుంది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈ చిత్రంతో రామ్ చరణ్ సరసన నటిస్తోంది.

కన్నడ సెన్సేషనల్ స్టార్ శివరాజ్ కుమార్ ఒక పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనుండటం సినిమాకు పాన్ ఇండియా అప్పీల్‌ను తీసుకొచ్చింది.  ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తుండటంతో మ్యూజికల్‌గా కూడా ఇది ఒక వండర్‌లా ఉండబోతోంది. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీని ఈ ఏడాది వేసవి కానుకగా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి రామ్ చరణ్ అటు తండ్రిగా, ఇటు గ్లోబల్ స్టార్‌గా తన జీవితంలోని అత్యుత్తమ దశను ఆస్వాదిస్తున్నారు.