ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 వార్మప్ మ్యాచ్ లో భాగంగా టీమిండియా సౌతాఫ్రికాపై మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. బుధవారం (ఫిబ్రవరి 4) ముంబైగా వేదికగా డీవై పాటిల్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. వరుసగా సిరీస్ విజయాలతో ఉన్న టీమిండియా ప్రాక్టీస్ లో తమ ఆట తీరును మరింత మెరుగుపర్చుకోవాలని భావిస్తోంది. సౌతాఫ్రికా లాంటి పటిష్టమైన జట్టు కావడంతో సీనియర్ జట్టు బరిలోకి దిగుతుంది. వార్మప్ మ్యాచ్ లో భాగంగా టీమిండియా ఆడబోయే ఏకైక మ్యాచ్ ఇదే. మొత్తం మూడు వార్మప్ మ్యాచ్ లో భాగంగా రెండు ఇండియా 'ఏ'.. నేడు జసౌతాఫ్రికాతో జరగబోయే ఒక్క మ్యాచ్ టీమిండియా ఆడుతుంది.
ఈ మ్యాచ్ లో తిలక్ వర్మ ఆడడం లేదు. అమెరికాతో జరిగిన తొలి ఇండియా ఏ తరపున ప్రాక్టీస్ మ్యాచ్ ఆడిన ఈ హైదరాబాద్ కుర్రాడు నేటి మ్యాచ్ లో రెస్ట్ లభించే అవకాశాలు ఉన్నాయి. వార్మప్ మ్యాచ్ కావడంతో ఈ మ్యాచ్ లో బాగా ఆడిన ప్లేయర్లకు ప్లేయింగ్ 11 లో చోటు లభించే అవకాశాలు ఉంటాయి. హర్షిత్ రానా, కుల్దీప్ యాదవ్, సంజు శాంసన్ సఫారీలతో జరిగే మ్యాచ్ లో సత్తా చాటితే తుది జట్టులో అవకాశం దక్కొచ్చు. మ్యాచ్ సాయంత్రం 7 గంటలకు జరుగుతుంది. జియో హాట్‌స్టార్ యాప్, స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లోవార్మప్ మ్యాచ్ లు ప్రత్యక్ష ప్రసారమవుతాయి.
సోమవారం (ఫిబ్రవరి 2) నుంచి ఫిబ్రవరి 6 వరకు వార్మప్ మ్యాచ్ లు జరుగుతాయి. మొత్తం 5 రోజుల పాటు 15 మ్యాచ్ ల షెడ్యూల్ ను ఏర్పాటు చేశారు. మొత్తం మూడు వార్మప్ మ్యాచ్ లు టీమిండియా ఆడాల్సి ఉంది. ఇండియా నేడు (ఫిబ్రవరి 4) సౌతాఫ్రికాతో వార్మప్ మ్యాచ్ ఆడుతుంది. వరల్డ్ కప్ లో మన జట్టు ఆడబోయే లీగ్ మ్యాచ్ కు మూడు రోజుల ముందు డీవై పాటిల్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. మ్యాచ్ సాయంత్రం 7 గంటలకు జరుగుతుంది. అమెరికా, నమీబియాలతో జరగబోయే వార్మప్ మ్యాచ్ ల కోసం సీనియర్ జట్టు కాకుండా ఇండియా 'ఏ' జట్టు ఆడనుంది.
బీసీసీఐ భారత 'ఏ' జట్టును సోమవారం (ఫిబ్రవరి 2) ప్రకటించింది. భారత ఏ జట్టుకు బదోనీ కెప్టెన్సీ చేయనున్నాడు. స్క్వాడ్ లో తిలక్ వర్మను కూడా ఎంపిక చేశారు. మన్ ధీర్, అశుతోష్ శర్మ, ప్రియాంష్ ఆర్య, ఉర్విల్ పటేల్, పరాగ్ జట్టులో సత్తా చాటడానికి సిద్ధమయ్యారు. ఇటీవల న్యూజిలాండ్ తో జరిగిన టీ20 సిరీస్ లో ఆడిన రవి బిష్ణోయ్ ని ఎంపిక చేశారు. మానవ్ సుతార్, విప్రజ్ నిగమ్ రూపంలో ఇద్దరు స్పిన్-బౌలింగ్ ఆల్ రౌండర్లు ఉన్నారు. గుర్జప్నీత్ సింగ్, ఖలీల్ అహ్మద్, మయాంక్ యాదవ్, అశోక్ శర్మ లతో పేస్ విభాగాన్ని ఎంపిక చేశారు. యూఎస్ఏ తో జరిగిన తొలి వార్మప్ మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించింది.
