హోటల్ మేనేజ్ మెంట్ చదువుకోసం విదేశాలకు వెళ్లిన తెలంగాణ విద్యార్థి ప్రమాదవ శాత్తు మృతి చెందిన ఘటన స్పెయిన్ లో జరిగింది. పెద్దపల్లి జిల్లా శ్రీరాంపూర్ మండలం కూనారం గ్రామానికి చెందిన గిట్ల సాయి అఖిల్ రెడ్డి స్పెయిన్ లోని వాల్సేనియా నగరంలో ఓ భవనంపైనుంచి పడి చనిపోయాడు. ఆరునెలల క్రితం స్పెయిన్ వెళ్లిన సాయి అఖిల్ రెడ్డి స్నేహితులతో కలిసి ఓ అపార్టెమెంట్ లో ఉంటున్నాడు. మంగళవారం(జూన్ 30) తాను ఉంటున్న భవనంపైనుంచి ప్రమాదవశాత్తు కిందపడిపోయాడు. తీవ్రగాయాలతో చనిపోయినట్లు తల్లిదండ్రులకు అతని స్నేహితులు సమాచారం అందించారు. దీంతో సాయిల్ అఖిల్ రెడ్డి కుటుంబంలో విషాద ఛాయలు అలముకొన్నాయి.
ఆరునెలల క్రితం స్పెయిన్ వెళ్లిన సాయి అఖిల్ రెడ్డి స్నేహితులతో కలిసి ఓ అపార్టెమెంట్ లో ఉంటున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 27 న సాయంత్రం సమయంలో నివాసం ఉండే భవనం పై నుండి ప్రమాదవశాత్తు కింద పడడంతో తలకు తీవ్ర గాయాలై చనిపోయాడు. తమ కుమారుడు మరణించాడన్న సమాచారంతో తల్లిదండ్రులు ఒక్కసారిగా కృంగిపోయారు. కొడుకు మృతిని తట్టుకోలేక తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. అఖిల్ భౌతికకాయాన్ని తమకు అప్పగిస్తే అంత్యక్రియలు నిర్వహించుకుంటామని, ప్రభుత్వం సహాయం చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
