హైదరాబాద్: హెచ్‌ఎండీఏ నిర్వహించిన మోకిలా లేఅవుట్ ఫేజ్-3 ఈ-ఆక్షన్‌కు భారీ స్పందన వచ్చింది. వేలంలో పెట్టిన 100 ప్లాట్లు విక్రయించారు. చదరపు గజానికి అత్యధికంగా లక్షా 9 వేల 500 రూపాయల బిడ్ నమోదైంది. సగటుగా బిడ్ ధర చదరపు గజానికి 75 వేల 640 రూపాయలు పలకడం విశేషం. ఈ-ఆక్షన్ ద్వారా హెచ్‌ఎండీఏకు 231.65 కోట్ల ఆదాయం దక్కింది. హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల నుంచి బిడ్డర్లు భారీగా పాల్గొన్నారు.
హైదరాబాద్ వెస్ట్ కారిడార్‌లో పెట్టుబడులకు ఈ-ఆక్షన్ మరింత ఊతమిస్తుందని హెచ్ఎండీఏ (hmda) అభిప్రాయపడింది. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం మోకిలలోని సర్వే నంబర్96లో 100 ప్లాట్లను hmda వేలం వేసింది. ఇక్కడ కూడా మేడిపల్లి తరహాలోని ప్లాట్ల సైజులు ఉన్నాయి. ఈ ప్రాంతంలో భూముల ధరలకు మంచి డిమాండ్ ఉండడంతో చ. గ. నికి కనీస ధర 50వేలుగా నిర్ణయించింది.
గ్రేటర్ పరిధిలో భూముల వేలానికి హెచ్ఎండీఏ రెడీ అయ్యింది. నిధుల లేమితో అనేక ప్రాజెక్టులు పెండింగ్లో ఉండగా, వాటిని పట్టాలెక్కించేందుకు భూముల వేలం ద్వారా రూ.1500 కోట్లను రాబట్టుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే మేడిపల్లిలోని సర్వే నంబర్62లో 68 ప్లాట్లు వేలానికి పెట్టింది.
