T20 World Cup 2026: కిషాన్‌కు నో ఛాన్స్.. వరల్డ్ కప్ తొలి మ్యాచ్‌లో టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్

T20 World Cup 2026: కిషాన్‌కు నో ఛాన్స్.. వరల్డ్ కప్ తొలి మ్యాచ్‌లో టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్

ఐసీసీ 2026 టీ20 వరల్డ్ కప్ కు నాలుగు రోజుల సమయం మాత్రమే ఉంది. ప్రస్తుతం అన్ని జట్లు వార్మప్ మ్యాచ్ లతో బిజీగా ఉన్నాయి. 2026 ఫిబ్రవరి 7న పాకిస్తాన్- నెదర్లాండ్ మధ్య జరగబోయే తొలి మ్యాచ్ తో ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. నెల రోజుల పాటు జరగనున్న ఈ టోర్నీ మార్చి 8న ముగుస్తుంది. షెడ్యూల్ ప్రకారం తొలి రోజే ఇండియా మ్యాచ్ ఆడనుంది. శనివారం (ఫిబ్రవరి 7) సాయంత్రం 7 గంటలకు యూఎస్ఏ తో మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ లో టీమిండియా ప్లేయింగ్ 11 పై ఆసక్తి నెలకొంది. న్యూజిలాండ్ సిరీస్ తర్వాత ఎలాంటి జట్టుతో బరిలోకి దిగాలో టీమిండియా లెగ్ స్పిన్నర్ చాహల్ తన ప్లేయింగ్ 11 చెప్పుకొచ్చాడు. 

అభిషేక్ శర్మతో పాటు సంజు శాంసన్ ఇన్నింగ్స్ ఓపెనింగ్ చేయాలని చాహల్ సూచించాడు.  బ్యాకప్ వికెట్ కీపర్ ఇషాన్ కిషాన్ కు తన జట్టులో స్థానం ఇవ్వలేదు. కిషాన్ ఇటీవలే న్యూజిలాండ్ తో జరిగిన 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ అసాధారణంగా రాణించాడు. ఒక సెంచరీతో పాటు ఒక హాఫ్ సెంచరీ చేసి 200 పైగా స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేసి సత్తా చాటాడు. అయినా చాహల్ కిషాన్ ను పక్కన పెట్టడం ఆశ్చర్యానికి గురి చేసింది. గాయం నుంచి కోలుకున్న తిలక్ వర్మ మూడో స్థానంలో ఎంపిక చేశాడు. నాలుగో స్థానంలో కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ను ఎంచుకున్నాడు.

Also Read : కమ్మిన్స్ ఐపీఎల్ ఆడతాడా..? సన్ రైజర్స్ కెప్టెన్ సమాధానమిదే

ఐదో స్థానంలో ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య.. శివమ్ దూబే ఆరో స్థానంలో.. రింకూ సింగ్ ఏడో స్థానంలో.. అక్షర్ పటేల్ ను 8 వ స్థానాలకు ఎంపిక చేశాడు. ఫాస్ట్ బౌలర్లుగా జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్ లకు తన ప్లేయింగ్ 11 లో చోటు కల్పించాడు. ఏకైక స్పిన్నర్ గా వరుణ్ చక్రవర్తిని తన తుది జట్టులో ఛాన్స్ ఇచ్చాడు. కుల్దీప్ యాదవ్ లాంటి నాణ్యమైన స్పిన్నర్ ఉన్నప్పటికీ చాహల్ మిస్టరీ స్పిన్నర్ వరుణ్ కు అవకాశం ఇచ్చాడు. ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రానాకు తన ప్లేయింగ్ 11నుంచి పక్కన పెట్టాడు. ఓవరాల్ గా చాహల్ ప్రకటించిన  ప్లేయింగ్ 11 నుంచి ఇషాన్ కిషాన్, హర్షిత్ రానా, ఇషాన్ కిషాన్ ను బెంచ్ కు పరిమితం చేశాడు. 

వరల్డ్ కప్ తొలి మ్యాచ్ కు చాహల్ టీమిండియా ప్లేయింగ్: 

అభిషేక్ శర్మ, సంజు సామ్సన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య, శివం దుబే, రింకు సింగ్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్