విశాఖ ఇండస్ట్రీస్ స్పాన్సర్గా కాకా వెంకటస్వామి మెమోరియల్ ఇంటర్ డిస్ట్రిక్ట్స్ T20 లీగ్

విశాఖ ఇండస్ట్రీస్ స్పాన్సర్గా కాకా వెంకటస్వామి మెమోరియల్ ఇంటర్ డిస్ట్రిక్ట్స్ T20 లీగ్

హైదరాబాద్: హైద్రాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్వర్యంలో విశాఖ ఇండస్ట్రీస్ సహకారంతో కాకా వెంకటస్వామి మెమోరియల్ ఇంటర్ డిస్ట్రిక్ట్స్ T20 లీగ్ నిర్వహణకు సంబంధించి మంత్రి వివేక్ వెంకటస్వామి జెర్సీ లాంచ్ చేశారు. ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో హైద్రాబాద్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులతో పాటు జిల్లాల సెక్రటరీలు పాల్గొన్నారు ఈ నెల 22 నుంచి జనవరి 17 వరకు టోర్నమెంట్ జరగనుంది. 

అన్ని జిల్లాల నుంచి నైపుణ్యం ఉన్న ప్లేయర్స్ను HCA సభ్యులు ఇప్పటికే సెలెక్ట్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. హైద్రాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రూరల్ టోర్నమెంట్ను ప్రోత్సహించే ఉద్దేశంతో ఇంటర్ డిస్ట్రిక్ట్స్ టోర్నమెంట్ నిర్వహించామని, ఎక్కువ సంఖ్యలో రూరల్ ఏరియాల నుంచి వచ్చి కప్ కొట్టారని ఆయన గుర్తుచేశారు.

చాలా సార్లు నైపుణ్యం ఉన్న ప్లేయర్లను ప్రోత్సహించేందుకు గ్రామీణ ప్రాంతాల నుంచి క్రికెటర్లు రావాలని కాకా వెంకటస్వామి పేరు మీద చాలా టోర్నమెంట్లు నిర్వహించామని ఆయన చెప్పారు. విశాఖ ఇండస్ట్రీస్ నుంచి ఈ టోర్నమెంట్ స్పాన్సర్గా ఉన్నామని, క్రీడాకారులను ప్రోత్సహించడంలో విశాఖ ఇండస్ట్రీస్ ఎప్పటికీ ముందు ఉంటుందని మంత్రి తెలిపారు.

విశాఖ ఇండస్ట్రీస్ స్పాన్సర్గా నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్లో మొదటి దశలో 29 టీమ్స్ ఉంటాయని.. మొత్తం 55 మ్యాచులు ఉంటాయని చెప్పారు. రెండవ దశలో 10 టీమ్స్ ఉంటాయని, మొత్తం 49 మ్యాచులు ఉంటాయని తెలిపారు. అన్ని మ్యాచ్లకు లైవ్ స్ట్రీమింగ్ ఉంటుందని, జోన్ల వారీగా మ్యాచ్లు ఉంటాయని మంత్రి వివరించారు.

మంత్రి వివేక్ వెంకటస్వామి ఇంకా ఏం చెప్పారంటే..
* కాకా వెంకటస్వామి ఉప్పల్ స్టేడియానికి సహకారం అందించారు
* LB స్టేడియంకు చిన్నపుడు నన్ను మా నాన్న గారు తీసుకెళ్ళేవారు
* వరంగల్ జోన్, కరీంనగర్ జోన్, నల్గొండ జోన్, నిజామాబాద్ జోన్, ఖమ్మం జోన్, ఆదిలాబాద్ జోన్, మహబూబ్ నగర్ జోన్, మెదక్ జోన్ల వారీగా మ్యాచ్లు
* విన్నింగ్ టీమ్కు 5 లక్షలు.. రన్నరప్ టీమ్కు 3 లక్షలు
* 3rd టీమ్కు 2 లక్షలు.. 4th టీమ్కు లక్ష రూపాయల ప్రైజ్ మనీ