ఈ ఏడాది (2025) చివరి అమావాస్య డిసెంబర్ 19వ తేదీన వేకువజామున 4.19 గంటలకు ప్రారంభమవుతుంది. మరుసటి రోజు అంటే డిసెంబర్ 20వ తేదీ ఉదయం 07.13 గంటలకు ముగుస్తుంది.మార్గశిర అమావాస్య కొన్ని రాశుల వారికి విపరీతంగా కలిసివస్తుంది. వారి జీవితమే మారిపోతుంది. ఏ రాశి వారికి ఈ అమావాస్య నుంచి కలిసివస్తుందో తెలుసుకోండి.
మేషరాశి : ఈ రాశివారు ప్రతికూల ఫలితాలు వస్తాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. కోరికలను ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవాలి. తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు. కుటుంబ సమస్యలు ఏర్పడి మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని జ్యోతిష్కులు తెలిపారు. అనవసనరమైన చర్చలకు దూరంగా ఉండే మంచిదని చెబుతున్నారు.
వృషభ రాశి:ఈ రాశి వారికి 2025 వ సంవత్సరం చివరి అమావాస్య రోజు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. . ఆశ్చర్యకరమైన సంఘటనలను చూస్తారు. అన్నీ మీరు అనుకున్నట్లే జరుగుతాయి. ఆనందం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు.
మిథునరాశి : ఈ రాశి వారికి పని ఒత్తిడి వలన అలసట కలుగుతుంది. అన్నదమ్ముల నుంచి పూర్తి సహాయ సహకారాలు అంది.. కొత్త స్నేహితులు ఏర్పడే అవకాశం ఉంది. గతంలో ఎవరికైనా అప్పు ఇస్తే ఈ కాలంలో తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు.
కర్కాటక రాశి: ఈ రాశి వారు చాలా నిజాయితీగా గడుపుతారు. కొన్ని అవసరాలు తీరతాయి. గతంలో మిమ్మలను విబేధించిన వారు మీ దగ్గరికి వస్తారు. కొన్ని ఆపదల నుంచి రక్షించుకోగలుగుతారు. ఇప్పటి వరకు కుంటుంబంలో ఉన్న చికాకులు తొలగి మనస్సు ప్రశాంతత కలుగుతుందట. రీసెర్చ్ చేసే విద్యార్థులకు . ఈ కాలం చాలా ప్రయోజనకరంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు.
సింహరాశి : సింహ రాశి వారికి ఈ అమావాస్య ( డిసెంబర్ 19) పాత చేదు జ్ఞాపకాలను, ఎదురుదెబ్బలను తుడిచిపెట్టేస్తుంది. మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయనే నమ్మకం తిరిగి వస్తుంది. చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభిస్తుంది. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. జీవితం ఆనందంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు.
కన్యరాశి : ఈ అమావాస్య రోజు ( డిసెంబర్ 19) ఈ రాశి వారు ఏ విషయం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. చాలా సంతోషంగా గడుపుతారు. కొన్ని విషయాల్లో నెమ్మదిగాఉండండి. అనుకున్న ప్రణాళికను అమలు చేస్తారు. ఇప్పటి వరకు వ్యతిరేకించిన పాత స్నేహితులు కూడా మద్దతు లభిస్తుందని పండితులు చెబుతున్నారు. కాని ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
తులారాశి: ఈ రాశి వారికి డిసెంబర్ 19.... మార్గశిర అమావాస్య రోజు అపారమైన వ్యాపార ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్కులు చెబుతున్నారు. కొత్త వ్యాపారం ఊపందుకుంటుందని చెబుతున్నారు. ఉద్యోగం ఎదురు చూసే వారికి జాబ్ ఆఫర్, ఉద్యోగస్తులకు ప్రమోషన్ లభించే అవకాశాలున్నాయి
వృశ్చిక రాశి: ఈ రాశి వారికి సంబంధాలు బలపడుతాయి. కొన్ని విషయాల్లో మనశ్శాంతి కలుగుతుంది. ఇప్పటి వరకున్న చిక్కులు తొలగుతాయి. ఆర్థికంగా బలపడతారని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
ధనుస్సు రాశి: ఈ రాశి వారు ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడి, పరీక్షా కాలం ఇంతటితో ముగుస్తుంది. అమావాస్య ( డిసెంబర్ 19) తర్వాత మీ మానసిక పరిస్థితిలో పెద్ద మార్పు ఉంటుంది. గతంలో అసాధ్యం అని భావించిన పనులు సైతం.. ఇప్పుడు సులువుగా చేసేస్తారు. సమస్యలన్నీ సమసిపోతాయి. మనస్సు తేలికగా మారుతుంది. సానుకూల మార్గంలో ముందుకు సాగుతారు.
మకరరాశి : కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది. కాని కొన్ని అనవసర ఖర్చులు పెరుగుతాయి. అయితే ఆవేశంగా నిర్ణయాలు తీసుకోవద్దని పండితులు సూచిస్తున్నారు. ఉద్యోగుల విషయంలో తోటి ఉద్యోగులతో పాటు ఉన్నతాధికారులతో సంబంధాలు మెరుగుపడతాయని పండితులు చెబుతున్నారు.
కుంభ రాశి: ఈ రాశి వారు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. రూపొందించుకున్న ప్రణాళికలలో ఆకస్మిక మార్పులు వచ్చే అవకాశం ఉంది. అవి చివరికి శుభ ఫలితాలను ఇస్తాయి. కొత్త వార్తలు మీ మానసిక స్థితిని సానుకూలంగా మారుస్తాయి. ఎలాంటి ఆందోళన లేకుండా హాయిగా గడుపుతారు.
మీన రాశి: ఈ రాశి వారికి చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు అకస్మాత్తుగా ఊపందుకుంటాయి. జీవిత మార్గంలో అడ్డంకులు వాటంతట అవే తొలగిపోతాయి. ప్రియమైన వ్యక్తితో ఒక చిన్న సంభాషణ చాలా కాలం పాటు జ్ఞాపకంగా నిలిచి ఉండే ఆనందాన్ని ఇస్తుంది
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించలేదు. మీకున్న వాస్తు, జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
