IPL 2026: వేలంలో బోల్తా పడిన లక్నో.. నాలుగు మ్యాచ్‌లే ఆడతానని చెప్పినా రూ.8.60 కోట్లు

IPL 2026: వేలంలో బోల్తా పడిన లక్నో.. నాలుగు మ్యాచ్‌లే ఆడతానని చెప్పినా రూ.8.60 కోట్లు

ఐపీఎల్ 2026 మినీ వేలంలో లక్నో సూపర్ జయింట్స్ పొరపాటు చేసినట్టుగానే కనిపిస్తోంది. మంగళవారం (డిసెంబర్ 16) అబుదాబి వేదికగా జరిగిన ఆక్షన్ లో ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ జోష్ ఇంగ్లిస్ ను రూ. 8.60 కోట్ల ధరకు లక్నో సూపర్ జయింట్స్ సొంతం చేసుకుంది. ఇంగ్లిస్ లాంటి విధ్వంసకర బ్యాటర్ కు ఎంత పెట్టి కొనుకున్నా అందులో పెద్ద విశేషం ఉండదు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ ఆసీస్ వికెట్ కీపర్ బ్యాటర్ సీజన్ మొత్తం ఆడనని బీసీసీఐకి ముందే తెలియజేశాడు. కేవలం నాలుగు మ్యాచ్  లు మాత్రమే ఆడగలనని చెప్పుకొచ్చాడు. 

ఐపీఎల్ 2025 సీజన్ లో పంజాబ్ కింగ్స్ తరఫున అద్భుతంగా ఆడిన జోష్ ఇంగ్లిస్ ను రిటైన్ చేసుకోలేదు. బుమ్రా బౌలింగ్ లో సిక్సర్లు బాది  కొట్టి ఆధిపత్యం చూపించినా.. ఎన్నో మ్యాచ్ ల్లో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ లు ఆడినా ఇంగ్లిస్ ను రిలీజ్ చేయడానికి కారణం లేకపోలేదు. ఐపీఎల్ 2026 లో ఇంగ్లిస్ కేవలం 25 శాతం లేదా దాదాపు నాలుగు మ్యాచ్‌లకు మాత్రమే అందుబాటులో ఉంటానని బీసీసీఐకి తెలిపాడు. ఇంగ్లిస్ ఈ నిర్ణయం తీసుకోవడంలో కారణం లేకపోలేదు. ఐపీఎల్ సమయంలో తన వివాహం ఉన్న కారణంగా అన్ని మ్యాచ్ లకు అందుబాటులో ఉండనని ముందే ధృవీకరించాడు. 

మినీ ఆక్షన్ లో ఈ ఆసీస్ బ్యాటర్ రూ. 2 కోట్ల బేస్ ప్రైజ్ తో ఆక్షన్ లో వచ్చాడు. ఇంగ్లిస్ పై చాలా ఫ్రాంచైజీలు ఆసక్తి చూపించకపోయినా లక్నో మాత్రం ఈ ఆసీస్ స్టార్ కావాలనుకుంది. బహుశా 2027లో ఇంగ్లిస్ సేవలను వాడుకోవాలని చూస్తుందేమో. ఇంగ్లిస్ ప్రస్తుతం యాషెస్ ఆడుతూ బిజీగా ఉన్నాడు. ఆక్షన్ లో ఇంగ్లిస్ ను ఏ ఫ్రాంచైజీ కొనకపోవచ్చు. ఐపీఎల్ 2025 సీజన్ లో ఇంగ్లిస్ పంజాబ్ కింగ్స్ తరపున ఆడి తన బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు. 

ఐపీఎల్ 2025 సీజన్ లో ఇంగ్లిస్ పంజాబ్ కింగ్స్ తరపున ఆడి తన బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు. 11 మ్యాచ్ ల్లో 278 పరుగులు చేసి టాప్ ఆర్డర్ లో జట్టుకు కీలక ప్లేయర్ గా మారాడు. ముఖ్యంగా ప్లే ఆఫ్స్ లో ముంబైపై ఆడిన ఇన్నింగ్స్ హైలెట్ గా నిలిచింది. ఐపీఎల్ 2025 సీజన్ లో ఈ ఆసీస్ బ్యాటర్ ను రూ 2.06 కోట్లకు పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది. మొత్తానికి లక్నో తీసుకున్న ఈ నిర్ణయం మాత్రం క్రికెట్ ఫ్యాన్స్ కు ఆశ్చర్యానికి గురి చేస్తోంది.