హైదరాబాద్: కమిషనరేట్ల సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనర్ల సమావేశం బుధవారం జరిగింది. నేరం ఎక్కడ జరిగినా జంట కమిషనరేట్ల పరిధిలో స్పందించాలని కమిషనర్లు నిర్ణయించారు. ట్రాఫిక్ నియంత్రణకు ఒకే రూల్ ఉండాలని నిర్ణయించారు. రౌడీషీటర్లు, అసాంఘిక శక్తుల పట్ల ఉమ్మడి కార్యాచరణతో ముందుకెళతామని తెలిపారు.
నగరంలోకి వచ్చే భారీ వాహనాలకు కమిషరేట్ల పరిధిలో.. నో ఎంట్రీకి ఒకే సమయం పాటించాలని.. జంట నగరాల్లో డ్రంకెన్ అండ్ డ్రైవ్ ఒకేసారి చేపట్టాలని నిర్ణయించారు. సరిహద్దు కమిషనరేట్ల పరిధిలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై నిర్ణయం తీసుకున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ రాకపోకలపై నియంత్రణ ఉండాలని.. సింగిల్ ఫోర్స్ లక్ష్యంగా పనిచేయాలని కమిషనర్లు నిర్ణయించడం గమనార్హం.
Also Read : స్పీకర్ తీర్పుపై హైకోర్టుకు.. ఐదుగురు ఎమ్మెల్యేలకు క్లీన్ చీట్పై బీఆర్ఎస్
కమిషనర్లు తీసుకున్న కీలక నిర్ణయాలు:
* నేర నియంత్రణలో 'సరిహద్దులు' చూడొద్దు
* ‘జీరో డిలే’ విధానం పక్కాగా అమలు చేయాలి: హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్
* మూడు కమిషనరేట్ల ఉన్నతాధికారుల సమన్వయ సమావేశం
* సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్న ప్రస్తుత తరుణంలో నేరస్తులు ఒక కమిషనరేట్ పరిధిలో నేరం చేసి, మరో కమిషనరేట్ పరిధిలోకి వెళ్తున్న అంశం ఉన్నతాధికారుల దృష్టికి..
* పరిధుల పేరుతో పోలీసులు కాలయాపన చేయడం వల్ల నేరస్తులు తప్పించుకునే అవకాశం ఉంది
* ఈ క్రమంలో కింది స్థాయి సిబ్బంది మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా చూడాలి: హైదరాబాద్ సీపీ సజ్జనార్
* నేరం ఎక్కడ జరిగినా, ఏ కమిషనరేట్ పరిధి అన్నది చూడకుండా సమీపంలోని పోలీసులు వెంటనే స్పందించాలి: హైదరాబాద్ సీపీ సజ్జనార్
* రౌడీషీటర్లు, పాత నేరస్తుల కదలికలపై మూడు కమిషనరేట్ల పోలీసుల ఉమ్మడి నిఘా
* నేరాలతో పాటు నగరంలో ట్రాఫిక్ నిర్వహణ పైనా సమావేశంలో కీలక నిర్ణయాలు
* నగరంలోకి వచ్చే భారీ వాహనాల 'నో ఎంట్రీ' సమయాలను ఒకేలా అమలు చేయాలని నిర్ణయం
* ముఖ్యంగా పీక్ అవర్స్‌లో ఈ వాహనాలు రోడ్లపైకి రాకుండా, నగరం వెలుపలే నిలువరించాలని నిర్ణయం
* వారాంతాల్లో మందుబాబులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తప్పించుకోకుండా, మూడు కమిషనరేట్ల పరిధిలో ఏకకాలంలో ఉమ్మడి తనిఖీలు
* వాహనదారుల పెండింగ్ చలానాల వసూలు కోసం మూడు కమిషనరేట్ల పరిధిలో ఏకకాలంలో 'స్పెషల్ డ్రైవ్'లు
* సరిహద్దు జంక్షన్ల దగ్గర సిగ్నల్ టైమింగ్స్ విషయంలో రెండు కమిషనరేట్ల ట్రాఫిక్ పోలీసులు రియల్ టైమ్గా సమన్వయంతో పనిచేయాలి
* దీని వల్ల వాహనాల రాకపోకలు సాఫీగా సాగుతాయని స్పష్టం చేశారు.
* హైదరాబాద్ నగరంలో ప్రైవేట్ ట్రావెల్ బస్సుల వల్ల ట్రాఫిక్ సమస్యలు జటిలమవుతున్నాయని, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా సమన్వయంతో అడుగులు
