ఇండియా, సౌతాఫ్రికా జట్ల మధ్య నాలుగో టీ20 మ్యాచ్ రద్దయింది. బుధవారం (డిసెంబర్ 17) లక్నో వేదికగా ఏకనా క్రికెట్ స్టేడియంలో జరగాల్సిన ఈ మ్యాచ్ లో కనీసం టాస్ కూడా పడలేదు. దట్టమైన పొగమంచు కారణంగా మ్యాచ్ జరిపేందుకు వీలు కాలేదు. లక్నోలో AQI ఏకంగా 391 రికార్డ్ కావడంతో ప్రమాదకరమని గుర్తించిన అంపైర్లు.. మ్యాచ్ సాధ్యం కాదని ప్రకటించారు. టాస్ వేసే సమయంలో విజిబిలిటీ లేకపోవడంతో అంపైర్లు పోస్ట్ పోన్ చేశారు. పొగమంచు తీవ్రమవుతుండడం.. సమయం 9 మించి పోవడంతో మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్టు అంపైర్లు అధికారికంగా ప్రకటించారు.
భారత కాలమాన ప్రకారం 6:30 గంటలకు టాస్ వేయాలి. 7:00 గంటలకు మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే స్టేడియంలో దట్టమైన పొగ మంచు కారణంగా టాస్ ఆలస్యంగా వేయనున్నారు. దీంతో 7:30 గంటలకు టాస్ వేయనున్నారని సమాచారం. స్టేడియంలో ఉన్న పొగ మంచు ఎదురుగా ఉన్న స్టాండ్‌లలో ఉన్న ప్రేక్షకులు ఎవరూ కనిపించడం లేదని అక్కడ ఉన్న కామెంట్రీ వాళ్ళు తెలిపారు. పదే పదే పోస్ట్ పోన్ చేసినప్పటికీ పొగ మంచు కారణంగా స్టేడియంలో పరిస్థితులు మ్యాచ్ జరిపేందుకు వీలు కాలేదు.
Also Read : వేలంలో బోల్తా పడిన లక్నో.. నాలుగు మ్యాచ్‌లే ఆడతానని చెప్పినా రూ.8.60 కోట్లు
ఇప్పటివరకు ఇరు జట్ల మధ్య నాలుగు టీ20మ్యాచ్ లు జరిగాయి. ఇండియా 2-1 ఆధిక్యంలో నిలిచింది. తొలి టీ20లో ఇండియా గెలిస్తే.. సఫారీలు రెండో టీ20లో విజయం సాధించారు. మూడో టీ20లో అదిరిపోయే కంబ్యాక్ ఇచ్చిన టీమిండియా.. అలవోక విజయాన్ని అందుకుంది. తాజాగా నాలుగో టీ20 పొగమంచు కారణంగా రద్దయింది. సిరీస్ లోని చివరి మ్యాచ్ శుక్రవారం (డిసెంబర్ 19) అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్ లో ఇండియా గెలిస్తే 3-1 తేడాతో సిరీస్ గెలుస్తుంది. ఒకవేళ సౌతాఫ్రికా గెలిస్తే సిరీస్ 2-2తో సమం అవుతుంది.
