Ashes 2025-26: యాషెస్‌లో షాకిస్తున్న 'స్నికో' టెక్నాలజీ వివాదం.. క్లియర్ నాటౌట్ అయితే ఎలా ఔటిస్తారు..

Ashes 2025-26: యాషెస్‌లో షాకిస్తున్న 'స్నికో' టెక్నాలజీ వివాదం.. క్లియర్ నాటౌట్ అయితే ఎలా ఔటిస్తారు..

ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న యాషెస్ మూడో టెస్టులో ఘోరమైన తప్పిదాలు చోటు చేసుకున్నాయి. DRS విషయంలో తీవ్ర వివాదం నడుస్తోంది. మ్యాచ్ సమయంలో ఆస్ట్రేలియా DRS ఆపరేటర్స్ పై నెటిజన్స్ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. యాషెస్ రెండో రోజు ఆటలో భాగంగా ఇంగ్లాండ్ వికెట్ కీపర్ బ్యాటర్ జెమీ స్మిత్ ఔట్ కు అన్యాయం జరిగింది. క్లియర్ నాటౌట్ అయినప్పటికీ ఆస్ట్రేలియా స్నికోలో ఔటని చూపించడం షాకింగ్ మారింది. రెండో రోజు కమ్మిన్స్ బౌలింగ్ లో స్మిత్ పుల్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. షాట్ మిస్ కావడంతో బంతి వెళ్లి వికెట్ కీపర్ చేతుల్లో పడింది. 

బంతి బ్యాట్ కు తగిలిందేమో అని ఆస్ట్రేలియా  DRS కోరారు. రీప్లేలలో బ్యాట్, బంతి మధ్య భారీ అంతరం కనిపించినప్పటికీ స్నికోమీటర్ స్పైక్‌ను చూపించింది. దీంతో థర్డ్ అంపైర్ స్మిత్ ను ఔట్ ప్రకటించాడు. స్మిత్ ఔట్ తీవ్ర వివాదానికి దారి తీస్తోంది. స్మిత్ ఔట్ అని ప్రకటించడంతో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్లు తీవ్ర నిరాశకు గురయ్యాయి. ఆస్ట్రేలియాలో టెక్నాలజీ దారుణంగా ఉందని ఇంగ్లాండ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. మినిమమ్ కామన్ సెన్స్ లేకుండా ఔట్ అని ఎలా ప్రకటిస్తారు అని ఫైరవుతున్నారు.

అంతకముందు తొలి రోజు ఆటలో భాగంగా ఇంగ్లాండ్ పై సెంచరీ చేసి జోరు మీదున్న ఆస్ట్రేలియా వికెట్ కీపర్ థర్డ్ అంపైర్ తప్పిదం కారణంగా పెవిలియన్ కు చేరాడు. మిచెల్ స్టార్క్ స్నికోను తొలగించాలని.. అది ఇప్పటివరకు చెత్త టెక్నాలజీ అని చెప్పడం స్టంప్ మైక్ లో వినిపించింది. మరోవైపు ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ అంపైర్ నిర్ణయాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డెసిషన్ రివ్యూ సిస్టమ్ ఘోరంగా ఉందని విచారం వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 377 పరుగులకు ఆలౌటైంది. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది.