e-KYC చేసుకుంటే రేషన్ ఆపేస్తారన్నది దుష్ప్రచారం: సివిల్ సప్లై కమిషనర్

e-KYC చేసుకుంటే రేషన్ ఆపేస్తారన్నది దుష్ప్రచారం: సివిల్ సప్లై కమిషనర్

హైదరాబాద్: ఈకేవైసీ గురించి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని, ఈకేవైసీ చేసుకుంటే రేషన్ ఆపేస్తారన్నది దుష్ప్రచారం అని సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర స్పష్టం చేశారు. ఈకేవైసీ ఎప్పుడైనా చేసుకోవచ్చని.. కానీ చేసుకోవడం మాత్రం తప్పనిసరి అని గుర్తు చేశారు.

రేషన్ బియ్యం ఆపడం వంటిది ఏమీ ఉండదని, క్షేత్ర స్థాయిలో అందరికీ సమాచారం ఇచ్చామని, తుది గడువు అంటూ ఏమీ లేదని ఆయన తెలిపారు. రేషన్ కార్డులో ఎంత మంది పేర్లు ఉంటే.. అంత మంది కచ్చితంగా రేషన్ షాపుకు వెళ్లి వేలిముద్ర లేదా ఐరిష్​ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలు, బతుకు దెరువు, చదువుల కోసం ఇతర ప్రాంతాల్లో ఉంటున్నవారు ఈ–కేవైసీ చేసుకోవడం ఇబ్బందికరంగా మారింది.

ఏ రేషన్ ​షాపుకైనా వెళ్లి ఫుడ్​ సెక్యురిటీ కార్డు నంబర్​ చూపించి ఈ–కేవైసీ చేసుకునే అవకాశం ఉంది. కానీ చదువుల కోసం అనేక మంది స్టూడెంట్లు ఇతర ప్రాంతాల్లోని హాస్టళ్లలో ఉంటున్నారు. అలాంటి వారు గ్రామాలకు వచ్చి ప్రాసెస్​ చేయించుకుంటున్నారు. అలాగే గ్రామాల్లోని ప్రజలు పనులన్నీ మానుకొని రేషన్​షాపులు, ఆధార్ ​నమోదు కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. ఈ–కేవైసీ చేయించుకునేందుకు రేషన్​షాపునకు వెళితే.. ఆధార్, ఫోన్​ నంబర్​లింక్​అయి ఉండాలంటున్నారు.

ఈ– కేవైసీ ప్రాసెస్ ​చేసేందుకు టైమ్​పడుతోంది. పలు రేషన్​షాపుల్లోని బయో మెట్రిక్ మిషన్లలో వృద్ధులు, చిన్న పిల్లల వేలి ముద్రలు నమోదు కావడం లేదు. అలాంటి వారు ఆధార్​సెంటర్​కు వెళ్లి ఫోన్​నంబర్​తో సహా ఆధార్​అప్​డేట్​చేసుకోవాలని, తర్వాత రేషన్​ షాపుకు వస్తే ఈ–కేవైసీ ప్రాసెస్ అవుతుందని డీలర్లు చెబుతున్నారు.