అమెరికన్ టెక్ దిగ్గజం ఆపిల్ కంపెనీ త్వరలో లాంచ్ చేయబోతున్న 'ఐఫోన్ ఎయిర్ 2' గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు బయటకు వచ్చాయి. ఈ ఫోన్ అల్ట్రా స్లిమ్ ఉండటమే కాకుండా కెమెరా, ప్రాసెసర్ విషయంలో గొప్ప మార్పులతో రాబోతోంది. అయితే ఆపిల్ ఈ సెకండ్ జనరేషన్ ఫోన్ ధర కాస్త తగ్గించవచ్చని తెలుస్తుంది. ఈ ఏడాది ఐఫోన్ ఎయిర్ ధర ఇండియాలో రూ.1,19,900గా ఉండగా, ఇప్పుడే రాబోయే ఫోన్ ధర మరింత తగ్గే అవకాశం ఉండొచ్చు.
సమాచారం ప్రకారం ఈ కొత్త ఫోన్ అత్యంత స్లిమ్ డిజైన్‌తో ఉంటుంది. వెనుక భాగంలో డ్యూయల్-కెమెరా సిస్టం ఇచ్చారు. అంటే దీనికి రెండు కెమెరాలు ఉంటాయి. ఒకటి హై రెజోల్యూషన్ ఫోటోలు తీయడానికి 48 మెగాపిక్సెల్ లెన్స్, మరొకటి వివిధ రకాలలో ఫోటోలు తీయడానికి 12 మెగాపిక్సెల్ లెన్స్ ఇచ్చారు. ఫోన్ సన్నగా ఉన్న క్కూడా చాలా వేగంగా పనిచేయడానికి ఆపిల్ లేటెస్ట్ అండ్ పవర్‌ఫుల్ ప్రాసెసర్‌ను ఇందులో వాడుతోంది.
మొదట ఈ ఫోన్ వచ్చే ఏడాది (2025లో) వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ప్రస్తుత సమాచారం ప్రకారం, దీని తయారీలో కొంత ఆలస్యం జరుగుతోంది. అందుకే ఈ ఫోన్ 2026 చివరిలో లేదా 2027 మొదట్లో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.
ప్రస్తుతం ఉన్న ఐఫోన్ ఎయిర్ మోడల్ అమ్మకాలు ఆశించిన స్థాయిలో లేవు. అందుకే దీని డిజైన్‌ని మార్చి, ధరను కూడా సామాన్యులకు అందుబాటులో ఉండేలా ఇంకా ఎక్కువ మంది కస్టమర్లను ఆకట్టుకునేల ఆపిల్ ప్లాన్ చేస్తోంది
ప్రస్తుత ఐఫోన్ ఎయిర్ ఫీచర్లు:
పర్ఫార్మెన్స్ : A19 ప్రో చిప్
డిస్ ప్లే: ప్రోమోషన్ టెక్నాలజీతో 6.5-అంగుళాల సూపర్ రెటినా XDR
ఫోన్ మందం : అత్యంత సన్నని 5.6mm
కెమెరా: 18MP సెంటర్ స్టేజ్ సెల్ఫీ కెమెరా
సాఫ్ట్‌వేర్: iOS 26
మీరు సన్నని డిజైన్, అదిరిపోయే కెమెరా ఉన్న ఐఫోన్ కోసం చూస్తుంటే ఈ ఐఫోన్ ఎయిర్ 2 కోసం మరికొంత కాలం వేట్ చేయాల్సిందే.
