మరికొన్ని గంటల్లో మున్సిపల్ ఎన్నికలు.. కారులో రూ.5 లక్షల డబ్బు దొరికింది !

మరికొన్ని గంటల్లో మున్సిపల్ ఎన్నికలు.. కారులో రూ.5 లక్షల డబ్బు దొరికింది !

మేడ్చల్: మేడ్చల్ జిల్లా అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ద్రువ పత్రాలు లేకుండా వాహనంలో తరలిస్తున్న రూ.5 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ప్లయింగ్ స్క్వాడ్ బృందం అధికారులు తెలిపారు. మూడు మున్సిపాలిటీలలో ఎన్నికలు జరగనున్న క్రమంలో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు సుమారు రూ.5 లక్షల నగదు తరలిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఓ వాహనంలో నగదు లభ్యం అయ్యింది. అధికారుల తనిఖీల్లో భాగంగా ఎలక్షన్ అధికారులు వాహనాలు తనిఖీ చేస్తుండగా కారులో అక్రమంగా తరలిస్తున్న సుమారు 5 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకుని నగదు సీజ్ చేసినట్లు తెలిపారు. 

ఎన్నికలకు కొన్ని గంటలే ఉండడంతో సోమవారం రాత్రే అభ్యర్థులు ప్రలోభాలకు తెరతీశారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు డబ్బులు, మద్యం పంచుతున్నారు. మేయర్, చైర్​పర్సన్​ ఎన్నికలో ప్రతీ వార్డు కీలకమే కాబట్టి గెలుపుకోసం అన్ని పార్టీలూ సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. పార్టీలు ఇచ్చే ఫండ్​కు తోడు అభ్యర్థులు సైతం సొంత డబ్బు ఖర్చు చేస్తున్నారు.

►ALSO READ | మాదాపూర్ హైటెక్స్ జంక్షన్ దగ్గర కారులో మంటలు... ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే టైంలో...

కార్పొరేషన్లలో ఒక్కో ఓటుకు రూ.2 వేల నుంచి రూ.3వేల దాకా పంచుతుంటే మున్సిపాలిటీల్లో రూ.వెయ్యి నుంచి రూ.2వేల దాకా పంచుతున్నట్టు తెలిసింది. కొన్నిచోట్ల కుల సంఘాలకు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల దాకా ఇస్తున్నారనే వార్తలు వస్తున్నాయి.  జనరల్​స్థానాల్లో నెక్​టూ నెక్​ ఉన్నచోట్ల, రియల్ ఎస్టేట్​భూమ్, ఇండస్ట్రీస్​ఎక్కువగా ఉన్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీలో ఒక్కో ఓటుకు రూ.5వేల దాకా పంచుతున్నట్టు చెప్తున్నారు.