భారతీయ AI స్టార్టప్ Sarvam AI సంచలనం: జెమినీ, చాట్‌ జిపిటిలని మించిపోయిందిగా..

భారతీయ AI స్టార్టప్ Sarvam AI సంచలనం: జెమినీ, చాట్‌ జిపిటిలని మించిపోయిందిగా..

భారతదేశానికి ఇదొక  గర్వించదగ సమయం. ఎందుకంటే మన దేశానికి చెందిన సర్వం ఏఐ (Sarvam AI) అనే స్టార్టప్ సంస్థ, కృత్రిమ మేధస్సు (AI) రంగంలో ప్రపంచ దిగ్గజాలైన గూగుల్ (Gemini), ఓపెన్ AI (ChatGPT)ని మించిపోయి అద్భుతమైన ఫలితాలను సాధించింది. భారతదేశ భాషలను అర్థం చేసుకోవడంలో, ప్రాసెస్ చేయడంలో ఈ సంస్థ అగ్రస్థానంలో నిలిచింది.

సాధించిన విజయాలు ఇవే :
బుల్బుల్ V3: ఇది టెక్స్ట్-టు-స్పీచ్ మోడల్ అంటే రాసిన దానిని మాటలుగా మార్చడం. 11 భారతీయ భాషల్లో మనుషులు మాట్లాడినట్లే చాలా సహజంగా, తప్పులు లేకుండా మాట్లాడుతుంది. ఒక సర్వేలో 20 వేల మంది దీనికి ఓటు వేసి, గూగుల్ జెమిని కంటే ఇదే బాగుందని తేల్చారు. బుల్బుల్ V3 అనేది సర్వం AI  లేటెస్ట్ టెక్స్ట్-టు-స్పీచ్ మోడల్.  

ALSO READ : అది రూ.12 కోట్ల కారు.. 

సర్వం విజన్: ఇది 22 భారతీయ భాషల్లోని డాక్యుమెంట్లను చదవగలదు. సరిగ్గా లేని స్కాన్ కాపీలు లేదా చేతిరాతతో ఉన్న పేపర్లను కూడా 84.3% ఖచ్చితత్వంతో గుర్తించి చదువుతుంది. ప్రపంచ స్థాయి AI మోడల్స్ కూడా భారతదేశ భాషల విషయంలో ఇంత ఖచ్చితత్వాన్ని చూపలేకపోయాయి.  

సాధారణంగా గూగుల్ లేదా చాట్‌జిపిటి వంటి కంపెనీలు ఇంగ్లీష్‌పై ఎక్కువ దృష్టి పెడతాయి. భారతీయ భాషల ప్రాముఖ్యత వాటికి తక్కువ. కానీ సర్వం AI మన భాషల్లోని స్క్రిప్టుల్లో తేడాలను కనిపెట్టి మరీ పని చేసేలా మోడల్స్‌ను తయారు చేసింది. చిన్న కంపెనీ కదా, ఇంత పెద్ద దిగ్గజాలను ఎలా ఎదుర్కొంటుంది.. అని మొదట్లో విమర్శించిన వారే, ఇప్పుడు ఈ స్టార్టప్ సాధించిన ఫలితాలను చూసి ఆశ్చర్యపోతున్నారు.

ALSO READ : కళ్యాణ్ జువెలర్స్ స్టాక్ రాకెట్ దూకుడు..

సర్వం AI గురించి : 
2023లో ప్రత్యూష్ కుమార్, వివేక్ రాఘవన్ దీనిని బెంగళూరులో స్థాపించారు. సుమారు 53 మిలియన్ డాలర్ల అంటే  దాదాపు 440 కోట్లు  నిధులను సేకరించింది. భారత ప్రభుత్వం వీరికి అవసరమైన సూపర్ కంప్యూటింగ్ (GPU) సౌకర్యాలను కల్పించి అండగా నిలిచింది. ఏ రంగంలోనైనా పట్టుదల ఉంటే ప్రపంచ స్థాయి సంస్థలను కూడా మన దేశ స్టార్టప్‌లు మించిపోగలవని సర్వం AI నిరూపించింది. ఇది కేవలం టెక్నాలజీ విజయం మాత్రమే కాదు, డిజిటల్ రంగంలో భారతదేశం సాధించిన ఆత్మనిర్భరతకు ప్రతీక.