USAపై విక్టరీ.. ప్రతీకారం తీర్చుకున్న పాకిస్తాన్.. 191 ఛేజ్ చేయలేక చేతులెత్తేసిన అమెరికా బ్యాటర్లు

USAపై విక్టరీ.. ప్రతీకారం తీర్చుకున్న పాకిస్తాన్.. 191 ఛేజ్ చేయలేక చేతులెత్తేసిన అమెరికా బ్యాటర్లు

కొలంబో: టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా జరిగిన పాకిస్తాన్, USA మ్యాచ్లో పాక్ జట్టు 32 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. 191 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన అమెరికా జట్టు ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసి పాక్ చేతిలో ఓడింది. అమెరికా బ్యాటర్లలో శుభమ్ రంజనే 51 పరుగులు చేసి హాఫ్ సెంచరీతో రాణించగా, జహంగీర్ 49 పరుగులు, మిలింద్ కుమార్ 29 పరుగులు చేశారు. పాకిస్తాన్ ఆల్ రౌండ్ షోతో గెలుపు సొంతం చేసుకుంది. 

42-1, 58-2, 69-3, 123-4, 124-5, 152-6, 152-7. 156-8. ఇలా USA జట్టు పాక్ బౌలర్ల ధాటికి నిలువలేక వికెట్లను చేజార్చుకుంది. 2024 టీ20 వరల్డ్ కప్ మ్యాచ్లో సూపర్ ఓవర్ వరకూ తెచ్చి పాక్ను ఓడించిన అమెరికా జట్టుపై పాకిస్తాన్ ఈ గెలుపుతో ప్రతీకారం తీర్చుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. 

పాకిస్తాన్ బ్యాటర్లలో ఫర్హాన్ 73 పరుగులు, బాబర్ అజమ్ 46 పరుగులతో రాణించారు. షాదాబ్ ఖాన్ 30 పరుగులు, సయీమ్ అయూబ్ 19 పరుగులు చేశారు. అమెరికా బౌలర్లలో.. USA పేసర్ షాడ్లీ వాన్ షాల్క్‌‌‌‌‌‌‌‌విక్ 4 వికెట్లు తీసి రాణించాడు. మహ్మద్ మొహ్సిన్, హర్మీత్ సింగ్, నేత్రవాల్కర్ తలో వికెట్ తీశారు. ఉస్మాన్ ఖాన్, అబ్రార్ అహ్మద్ రనౌట్ కావడం గమనార్హం.