హైదరాబాద్‎లోని ఈ ఏరియాల్లో ఫిబ్రవరి 11, 12న నీళ్లు బంద్

హైదరాబాద్‎లోని ఈ ఏరియాల్లో ఫిబ్రవరి 11, 12న నీళ్లు బంద్

హైదరాబాద్​సిటీ, వెలుగు: పటాన్​చెరు నుంచి హైదర్​నగర్ వరకు, కలబ్​గూర్ నుంచి పటాన్​చెరు వరకు ఉన్న పీఎస్సీ పంపింగ్ మెయిన్​లో వివిధ ప్రాంతాల్లో భారీ లీకేజీలు ఏర్పడ్డాయి. ఈ లీకేజీలను అరికట్టేందుకు ఈ నెల 11న ఉదయం 6 గంటల నుంచి 12న రాత్రి 10 గంటల వరకు రిపేర్లు చేపడుతున్నారు. 

దీంతో ఆర్సీ పురం, అశోక్ నగర్, జ్యోతి నగర్, లింగంపల్లి, చందానగర్, గంగారం, మదీనాగూడ, మియాపూర్, బీరంగూడ, అమీన్​పూర్, భాగ్యనగర్ కాలనీ, ఆఫ్ టేక్ పాయింట్స్, బల్క్ కనెక్షన్లు, ఎర్రగడ్డ, ఎస్‌‌‌‌‌‌‌‌ఆర్ నగర్, అమీర్​పేట్, కేపీహెచ్ బీ కాలనీ, కూకట్‌‌‌‌‌‌‌‌పల్లి, భాగ్యనగర్ కాలనీ, ప్రగతి నగర్ తదితర ప్రాంతాల్లో రెండు రోజుల పాటు తాగునీరు సరఫరా ఉండదని అధికారులు తెలిపారు.