ఏఐ ప్రపంచాన్ని ఎంత వేగంగా మార్చేస్తుందో మనం చూస్తూనే ఉన్నాం. అయితే ప్రముఖ ఏఐ పరిశోధకుడు డాక్టర్ రోమన్ యాంపోల్స్కీ తాజాగా చేసిన హెచ్చరికలు వింటే ఎవరికైనా వెన్నులో వణుకు పుట్టాల్సిందే. స్టీవెన్ బార్ట్లెట్ పాడ్‌కాస్ట్ 'ది డైరీ ఆఫ్ ఏ సీఈఓ'లో మాట్లాడుతూ.. రాబోయే 5 ఏళ్లలో అంటే 2027 నాటికి దాదాపు 99 శాతం ఉద్యోగాలు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని సంచలన అంచనాలను బయటపెట్టారు.
మనం గతంలో చూసిన పారిశ్రామిక విప్లవాల కంటే ఇది పూర్తిగా భిన్నమైనదని యాంపోల్స్కీ చెబుతున్నారు. గతంలో యంత్రాలు వస్తే కొత్త రకమైన పనులు పుట్టుకొచ్చేవి.. కానీ ఏఐ విషయంలో మాత్రం ఇది పూర్తి భిన్నంగా ఉంది. 2027 నాటికి ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ అందుబాటులోకి వస్తుందని.. ఇది మనుషుల కంటే మెరుగ్గా ఆలోచించగలదని ఆయన తెలిపారు. దీనివల్ల ప్రపంచంలో నిరుద్యోగిత శాతం 10% కాదు.. ఏకంగా 99% కి చేరుకునే అవకాశం ఉందని హెచ్చరించారు.
ALSO READ : PFఖాతాదారులకు గుడ్ న్యూస్..ఏప్రిల్ నుంచి UPIతో పీఎఫ్ డబ్బులు డ్రా
అయితే ఈ ఏఐ సునామీలోనూ కేవలం 5 రకాల పనులు మాత్రమే కొంతకాలం మనుగడ సాగించగలవని ఆయన పేర్కొన్నారు. మొదటిది హ్యూమన్ క్రాఫ్ట్స్.. అంటే మనుషులు స్వయంగా చేతులతో తయారు చేసిన వస్తువులపై ఉండే మక్కువ వల్ల ఆ వృత్తులు మిగిలి ఉంటాయన్నారు. రెండోది హ్యూమన్ ఫీలింగ్.. ఒక మనిషి బాధను లేదా అనుభూతిని మరో మనిషి మాత్రమే అర్థం చేసుకోగలడు కాబట్టి కౌన్సెలర్లు వంటి వారికి డిమాండ్ ఉంటుందట. ఇక మూడోది సూపర్‌విజన్.. అదేనండి ఏఐ వ్యవస్థలను పర్యవేక్షించే వారు. నాలుగోది మధ్యవర్తులు.. ఏఐని సామాన్యులకు వివరించే నిపుణులు అన్నమాట. ఇక చివరి జాబ్ వ్యక్తిగత ప్రాధాన్యత.. వారెన్ బఫెట్ వంటి సంపన్నులు నమ్మకం కోసం ఏఐ కంటే మనిషినే అకౌంటెంట్‌గా ఎంచుకోవచ్చు. సో నమ్మకం కోసం మనుషులను వాడటం వల్ల కొందరి జాబ్స్ సేఫ్ అని చెప్పారు ఏఐ నిపుణుడు.
ALSO READ : 2026లో ఏ కంపెనీ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ వేగంగా సెటిల్ చేస్తోందా తెలుసా..? టాప్-10 లిస్ట్ ఇదే..
చివరగా 2045 నాటికి మానవాళి 'టెక్నలాజికల్ సింగ్యులారిటీ' అనే దశకు చేరుకుంటుందని యాంపోల్స్కీ హెచ్చరించారు. ఆ సమయంలో సాంకేతికత అభివృద్ధి ఏ స్థాయిలో ఉంటుందంటే.. అది మనిషి ఊహకు కూడా అందదు. ప్రతిరోజూ పెరుగుతున్న టెక్నాలజీతో పోలిస్తే.. ఒక నిపుణుడిగా తన తెలివితేటలు కూడా తగ్గిపోతున్నట్లు అనిపిస్తోందని ఆయన చేసిన వ్యాఖ్యలు ఏఐ భవిష్యత్తు ఎంత తీవ్రంగా ఉండబోతుందో అద్దం పడుతున్నాయి. మన ఉనికిని కాపాడుకోవాలంటే ఇప్పటి నుండే ఈ మార్పును అర్థం చేసుకోవడం ఎంతో ముఖ్యం అని వారు సూచిస్తున్నారు.
