PFఖాతాదారులకు గుడ్ న్యూస్..ఏప్రిల్ నుంచి UPIతో పీఎఫ్ డబ్బులు డ్రా

PFఖాతాదారులకు గుడ్ న్యూస్..ఏప్రిల్ నుంచి UPIతో పీఎఫ్ డబ్బులు డ్రా

న్యూఢిల్లీ: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) చందాదారులు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి యూపీఐ ద్వారా తమ పీఎఫ్ డబ్బును నేరుగా బ్యాంకు ఖాతాలోకి విత్‌‌‌‌‌‌‌‌డ్రా చేసుకోవచ్చు. దీని కోసం కార్మిక శాఖ కొత్త మొబైల్ యాప్‌‌‌‌‌‌‌‌ను రూపొందిస్తోంది. ప్రస్తుతం ఉన్న యూఏఎన్ పోర్టల్ లేదా ఉమంగ్ యాప్ ద్వారా పొందే సేవలు కొనసాగుతూనే ఉంటాయి.

కొత్త యాప్ ద్వారా పాస్‌‌‌‌‌‌‌‌బుక్ వివరాలు చూసుకోవడం సులభం అవుతుంది. ఆటో సెటిల్​మెంట్​ పరిమితిని రూ. లక్ష నుంచి రూ.ఐదు లక్షలకు పెంచారు. అనారోగ్యం, విద్య, పెళ్లి వంటి అవసరాల కోసం మూడు రోజుల్లోనే డబ్బు పొందే వీలు ఉంటుంది.

ఏటా సుమారు ఐదు కోట్ల క్లెయిమ్‌‌‌‌‌‌‌‌లను వేగంగా పరిష్కరించడమే ఈ నూతన విధానం ప్రధాన ఉద్దేశం. ప్రభుత్వ సేవలను బ్యాంకుల స్థాయికి తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది.