మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలోని SRP-3 గని లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురి కార్మికులకు గాయాలయ్యాయి. భూగర్భ గని లో పనిచేస్తున్న సంపత్ కుమార్, మహేందర్, రవికుమార్ అనే ముగ్గురిపై ఒక్కసారిగా సైడ్ ఫాల్ పడటంతో ప్రమాదం సంభవించింది. గాయపడిన వారిని సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారు.
