న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లో భారీ గిరాకీ, డాలర్ తగ్గడంతో దేశ రాజధానిలో వెండి, బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఢిల్లీలో సోమవారం కిలో వెండి ధర 6.66 శాతం పెరిగి రూ.2.72 లక్షల రికార్డు స్థాయికి చేరుకుంది. గత సెషన్‌తో పోలిస్తే వెండి ఏకంగా రూ.17 వేలు పెరగడం గమనార్హం. బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.1,300 పెరిగి రూ.1.58 లక్షలకు చేరుకుంది.
అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ సిల్వర్ ఔన్సుకు 80.21 డాలర్లకు పెరగగా, బంగారం 5,012 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ట్రంప్ వాణిజ్య విధానాలు, భౌగోళిక రాజకీయ అనిశ్చితి వల్ల ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడిగా పసిడి వైపు మొగ్గు చూపుతున్నారని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ ఎనలిస్టులు తెలిపారు.
చైనా సెంట్రల్ బ్యాంక్ వరుసగా 15వ నెలలోనూ బంగారం కొనుగోళ్లు కొనసాగించడం డిమాండ్‌ను మరింత పెంచింది. రానున్న రోజుల్లో విడుదల కానున్న అమెరికా నిరుద్యోగిత రేటు, ద్రవ్యోల్బణ లెక్కలు ధరల దిశను నిర్ణయిస్తాయని నిపుణులు భావిస్తున్నారు.
