హైదరాబాద్ ఎల్లమ్మ బండలో భవ్య తులసీవనం అపార్ట్మెంట్ వాసుల నిరసన

హైదరాబాద్ ఎల్లమ్మ బండలో భవ్య తులసీవనం అపార్ట్మెంట్ వాసుల నిరసన

హైదరాబాద్: ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మ బండలో భవ్య తులసీవనం అపార్ట్మెంట్ వాసులు నిరసన వ్యక్తం చేశారు. సేవ్ అవర్ లేక్ పేరిట ప్లకార్ట్లతో అపార్ట్మెంట్లో నివాసం ఉండే అపార్ట్మెంట్ వాసులు చెరువు దగ్గరకొచ్చి నిరసన తెలిపారు. చెరువులో డ్రైనేజీ నీరు కలవడంతో నానా ఇబ్బందులు పడుతున్నామని వెల్లడించారు. 

ఇరిగేషన్ అధికారులకు తమ ఫిర్యాదు అందిన వెంటనే డ్రైనేజీ నీరు కలవకుండా పనులు చేపట్టారని కానీ చెరువులో ఉన్న డ్రైనేజీ నీటితో చుట్టుపక్కల దుర్వాసనతో పాటు దోమలు విపరీతంగా పెరిగి ఆసుపత్రి పాలవాల్సి వస్తుందని అన్నారు.

హైడ్రా ఉన్నతాధికారులు, GHMC, ఇరిగేషన్, HMDA అధికారులు ముందుకొచ్చి చెరువుకు సంబంధించిన అభివృద్ధి పనులు ముందుకెళ్లే దిశగా అడుగులు వేయాలని కోరారు. సిఎస్ ఆర్ లో భాగంగా భవ్య తులసివనం కన్స్ట్రక్షన్స్ వారే చెరువును అభివృద్ధి చేయడంతో పాటు ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు ముందుకు వస్తామని ఈ సందర్భంగా తెలిపారు.

చెరువుకు సంబంధించి ఎఫ్టిఎల్, బఫర్ జోన్ ను అధికారులు నిర్ణయించి ఫెన్సింగ్ చేసి ఇస్తే ప్రభుత్వానికి రూపాయి ఖర్చు లేకుండా తాము అభివృద్ధి చేస్తామని తెలియజేశారు.