ఐపీఎల్ 2026 మినీ వేలం ముగిసింది. మంగళవారం (డిసెంబర్ 16) అబుదాబి వేదికగా జరిగిన ఈ వేలంలో మొత్తం మొత్తం 10 జట్లు ఐపీఎల్ 2026 కోసం తమ స్క్వాడ్ ను సిద్ధం చేసుకున్నాయి. మినీ ఆక్షన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తడబడినట్టు స్పష్టంగా అర్ధమవుతోంది. ఒక్క టాప్ బౌలర్ ను కూడా తీసుకోకుండా ఫామ్ లో లేని లివింగ్ స్టోన్ కోసం రూ.13 కోట్లు ఖర్చు చేశారు. బౌలింగ్ పై దృష్టి పెట్టకుండా ఐదుగురు డొమెస్టిక్ ప్లేయర్స్ ను బేస్ ప్రైస్ రూ. 30 లక్షలకు తీసుకున్నారు. సన్ రైజర్స్ మినీ ఆక్షన్ లో అట్టర్ ఫ్లాప్ అయిందని.. వారి వ్యహారాలు బాగా లేవని భారత మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ అభిప్రాయపడ్డాడు.
కృష్ణమాచారి శ్రీకాంత్ మాట్లాడుతూ ఇలా అన్నాడు " అన్ని జట్లు లివింగ్‌స్టోన్‌ను బేస్ ధరకే వదిలేశారు. మీకు లివింగ్ స్టోన్ కావాలనుకుంటే మొదట్లోనే బేస్ ప్రైస్ కు అతన్ని తీసుకొని ఉండాల్సింది. సన్ రైజర్స్ బ్యాటింగ్ లైనప్ గొప్పది. కానీ వారికి బౌలింగ్ లైనప్ వీక్ గా ఉంది. SRHకి నిజంగా లివింగ్‌స్టోన్ లాంటి ఆటగాడు అవసరమా? షమీని వదిలేసుకున్నపుడు అతని స్థానంలో ఒక టాప్ బౌలర్ ను భారీ ధరకు కొని ఉండాల్సింది. ఇప్పటికే సన్ రైజర్స్ జట్టు బలంగా కనిపిస్తున్నా బౌలింగ్ కారణంగా వారు గత ఏడాది ఫైనల్ కు చేరుకోలేదనే విషయాన్ని గుర్తించాలి". అని శ్రీకాంత్ తన యూట్యూబ్ ఛానెల్‌లోని ఒక వీడియోలో చెప్పుకొచ్చారు.
ఐపీఎల్ 2026 మినీ ఆక్షన్ లో లివింగ్‌స్టోన్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ రూ.13 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేశారు. మంగళవారం (డిసెంబర్ 16) అబుదాబి వేదికగా జరుగుతున్న మినీ వేలంలో మొదట అన్ సోల్డ్ గా మిగిలిపోయిన ఈ ఇంగ్లాండ్ వీరుడు.. చివర్లో భారీ ధరకు అమ్ముడుపోయాడు. లివింగ్ స్టోన్ జట్టులోకి చేరడంతో సన్ రైజర్స్ మిడిల్ ఆర్డర్ మరింత పటిష్టంగా కనిపిస్తుంది. గత రెండు సీజన్ లలో బ్యాటింగ్ లో పరుగుల వరద పారించిన హైదరాబాద్ జట్టుకు లివింగ్ స్టోన్ చేరడంతో ఈ సారి తమ జట్టు 350 పైగా కొడుతుందని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. జట్టులో టాప్-6 బ్యాటర్లు అందరూ కూడా అంతర్జాతీయ క్రికెట్ ఆడిన వారే కావడం విశేషం.
ఐపీఎల్ 2026 సన్‌రైజర్స్ హైదరాబాద్ పూర్తి జట్టు:
లియామ్ లివింగ్‌స్టోన్: రూ. 13 కోట్లు
జాక్ ఎడ్వర్డ్స్: రూ.3 కోట్లు
సలీల్ అరోరా: రూ.1.50 కోట్లు
శివం మావి: రూ.75 లక్షలు
శివాంగ్ కుమార్: రూ.30 లక్షలు
షకీబ్ హుస్సేన్: రూ.30 లక్షలు
ఓంకార్ తుకారాం తర్మలే: రూ.30 లక్షలు
అమిత్ కుమార్: రూ.30 లక్షలు
ప్రఫుల్ హింజ్: రూ.30 లక్షలు
క్రెయిన్స్ ఫులేట్రా: రూ.30 లక్షలు
పాట్ కమ్మిన్స్ (కెప్టెన్)
ట్రావిస్ హెడ్
అభిషేక్ శర్మ
అనికేత్ వర్మ
ఆర్. స్మరన్
ఇషాన్ కిషన్
హెన్రిచ్ క్లాసెన్
నితీష్ కుమార్ రెడ్డి
హర్ష్ దుబే
కమిండు మెండిస్
హర్షల్ పటేల్
బ్రైడాన్ కార్స్
జయదేవ్ ఉనద్కట్
ఎషాన్ మలింగ
జీషన్ అన్సారీ
