ఆస్తి గొడవలు, డబ్బుల వివాదంతో తల్లితండ్రులను దూరం చేసుకున్నవారిని చూసుంటారు కానీ భార్య పెట్టె టార్చర్ భరించలేక ఓ కొడుకు తల్లితండ్రులను అతికిరాతకంగా చంపేశాడు. ఈ ఘటన చాల ఆలస్యంగా వెలుగు చుసిన అక్కడి ప్రజలను మాత్రం భయంతో కుదిపేసింది.
ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్‌లో సొంత కొడుకే కాలయముడై కన్న తల్లిదండ్రులను అత్యంత దారుణంగా హత్య చేశాడు. తల్లిదండ్రులను చంపడమే కాకుండా, వారి శవాలను రంపంతో ముక్కలుగా నరికి నదిలో పారేశాడు. తప్పిపోయిన వృద్ధ దంపతుల కోసం ఐదు రోజుల పాటు సాగిన గాలింపు చర్యలు ఇవాళ (గురువారం) ముగిసింది.
పోలీసుల సమాచారం ప్రకారం... కోవిడ్ మహమ్మారి సమయంలో అంబేష్ కోల్‌కతాలో ఒక ముస్లిం మహిళను వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ప్రస్తుతం ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, అహ్మద్‌పూర్ గ్రామంలో ఉండే అంబేష్ కుటుంబంకి వీరి వివాహం ఇష్టం లేదు, దింతో విడిపోవాలని అతనిపై ఎప్పుడు ఒత్తిడి తెచ్చేది.
ఈ గొడవల మధ్య, అంబేష్ భార్య డబ్బులు డిమాండ్ చేయడం ప్రారంభించింది. దింతో అతను తన తల్లిదండ్రులను డబ్బు సహాయం అడగాల్సి వచ్చింది. ఈ విషయంపై కుటుంబంలో ఎప్పుడు గొడవలు జరిగేవి.
దాదాపు మూడు నెలల క్రితం, అంబేష్ కోల్‌కతా నుండి తిరిగి వచ్చి తన తల్లిదండ్రులతో ఉంటున్నాడు. అయిన కూడా అంబేష్ ఇంకా అతని తల్లిదండ్రుల మధ్య వాదనలు ఆగలేదు. అంబేష్ లోపల కోపం పెరుగుతూనే ఉంది.
డిసెంబర్ 8న, తీవ్ర వాగ్వాదం తరువాత అంబేష్ తన తల్లి బబిత (63) తలపై ఇనుప రాడ్ తో కొట్టాడు. అతని తండ్రి శ్యామ్ బహదూర్ (65) ఆపడానికి ప్రయత్నించగా అతన్ని కూడా కొట్టి, తాడుతో గొంతు నులిమి చంపాడని పోలీసులు చెప్పారు.
తన తల్లిదండ్రులను చంపిన తర్వాత, అంబేష్ నిర్మాణ పనులు జరుగుతున్న ఇంట్లో ఉన్న రంపాన్ని ఉపయోగించి మృతదేహాలను ఒక్కొక్కటి మూడు భాగాలుగా కోశాడు. ఆ తర్వాత అతను అవశేషాలను ఆరు సిమెంట్ సంచులలో నింపి, తన తల్లిదండ్రుల దుస్తులతో రక్తపు మరకలను శుభ్రం చేశాడు.
తర్వాత అంబేష్ తన కారులో సంచులను ఎక్కించి వాటిని గోమతి నదిలో పడేశాడు. అంబేష్ వారణాసి వైపు వెళుతుండగా సంచులలో సరిపోని అతని తల్లి శరీర భాగాన్ని మరో నదిలో విసిరివేశారు.
పోలీస్ దర్యాప్తులో ట్విస్ట్
ఈ వృద్ధ దంపతులకు వందన అనే కూతురు కూడా ఉంది. వందన తన తల్లిదండ్రులు, సోదరుడికి ఫోన్ చేసిన స్పందించకపోవడంతో డిసెంబర్ 13న ఆమె మిస్సింగ్ కేసు పెట్టింది. డిసెంబర్ 15న అంబేష్ ఆచూకీ లభించిన తర్వాత పోలీసుల దర్యాప్తులో పెద్ద మలుపు తిరిగింది.
విచారణలో అంబేష్ తన వాంగ్మూలాలను పదే పదే మార్చుకుంటున్నాడని పోలీసులు పసిగట్టారు. దింతో పోలీసులు అంబేష్‌ను అదుపులోకి తీసుకుని తమదైన స్టయిల్లో విచారించగా మొదట అబద్ధాలు చెబుతూ తర్వాత అసలు నిజాన్ని ఒప్పుకున్నాడు. ప్రస్తుతం పోలీసులు నదిలో పడేసిన శరీర భాగాల కోసం గాలిస్తుండగా.... నిందితుడు అంబేష్‌ను అరెస్ట్ చేసి జైలుకు పంపారు.
