సరిహద్దుల వివాదంతో ఆఫ్ఘనిస్తాన్ పై పాక్ యుద్దం ప్రకటించింది. శుక్రవారం తెల్లవారు జామున జరిగిన పరస్పర దాడుల తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. దీంతో ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ తోపాటు కాందహార్ పై పాకిస్తాన్ వైమానిక దాడులకు దిగింది.
కాబూల్ పై వైమానిక దాడులు జరిగినట్లు ఆఫ్టనిస్తాన్ అధికారులు ధృవీకరించారు. పాకిస్తాన్ యుద్ద విమానాలు దక్షిణ ఆఫ్ఘనిస్తాన్ లోని కాందహార్, ఆగ్నేయ పక్టియా ప్రావిన్స్ పై దాడులు చేశాయని తాలిబన్ ప్రతినిధ జబిహుల్లా ముజాహిద్ చెప్పారు. ప్రాణనష్టం ఏమైనా జరిగిందా అనే దానిపై ఆఫ్ఘన్ అధికారులు స్పష్టత ఇవ్వలేదు. అయితే కాబూల్ లో దాదాపు 133 మంది చనిపోయినట్లు ప్రకటించింది. ఇందులో పిల్లలు, మహిళలు ఉన్నారు.
స్థానిక మీడియా ప్రకారం.. గురువారం ఆఫ్ఘన్ సరిహద్దుప్రాంతాల్లో పాకిస్తాన్ వైమానిక దాడులకు ప్రతీకారంగా ఆఫ్ఘన్ సైన్యం సరిహద్దు దాటి దాడి చేసింది . ఈ ఆపరేషన్ లో పాకిస్తాన్ కు చెందిన డజనుకు పైగా ఆర్మీ పోస్టులను ఆఫ్ఘన్ సైనికులు స్వాధీనం చేసుకున్నారు. పదిమంది సైనికులను హతమార్చినట్లు ఆఫ్ఘన్ రక్షన మంత్రిత్వ శాఖ ప్రకటించింది. టోర్ఖం సరిహద్దు క్రాసింగ్ సమీపంలో పౌరులు కూడామృతి చెందినట్లు ఆఫ్ఘన్ అధికారులు తెలిపారు.
అయితే కాబూల్ వాదనలను పాకిస్తాన్ ఖండించింది. స్వాధీనం చేసుకున్న సైనిక పోస్టులపై ఆఫ్ఘన్ వాదనలు అబద్దమని సమాచార మంత్రి అత్తౌల్లా తరార్ అన్నారు. ఆఫ్ఘన్ రెచ్చగొట్టే కాల్పులుగా చెప్పారు.
హింసాకాండ పెరగడం అంతర్జాతీయంగా ఆందోళనలను రేకెత్తించింది. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ రెండు దేశాలు పౌరులను రక్షించాలని ,దౌత్యం ద్వారా విభేదాలను పరిష్కరించుకోవాలని కోరారు.
