మధిర, వెలుగు: ఖమ్మం జిల్లా బోనకల్లు రైల్వే స్టేషన్‌లో బుధవారం రాత్రి విధుల్లో ఉన్న మహిళా పాయింట్స్ మెన్ మోర్ల నిరోషాపై గుర్తు తెలియని సైకో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఆమె తలకు తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి.
నిరోషా బుధవారం రాత్రి స్టేషన్‌లో రెండో ప్లాట్‌ఫామ్‌పై నైట్ డ్యూటీ చేస్తోంది. అక్కడ చీకటిగా ఉండడంతో ఓ దుండగుడు ఆమెపై ఒక్కసారిగా గ్రానైట్ రాయితో దాడి చేశాడు. తలకు తీవ్రగాయాలు కావడంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. విషయం తెలుసుకున్న తోటి సిబ్బంది ఆమెను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడి కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో
గాలిస్తున్నారు.
