జానంపేటలో చారిత్రక తవ్వకాలకు రూ.20 లక్షలు... భారత పురాతత్వ సర్వే చేపడుతున్న ప్రాజెక్ట్ లు

జానంపేటలో చారిత్రక తవ్వకాలకు రూ.20 లక్షలు... భారత పురాతత్వ సర్వే చేపడుతున్న ప్రాజెక్ట్ లు

న్యూఢిల్లీ, వెలుగు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని జానంపేట చారిత్రక తవ్వకాల కోసం ఇప్పటివరకు రూ.20 లక్షలు ఖర్చు చేసినట్లు కేంద్రం వెల్లడించింది. భారత పురాతత్వ సర్వే చేపడుతున్న దేశవ్యాప్త ప్రతిష్ఠాత్మక తవ్వకాల ప్రాజెక్టుల్లో తెలంగాణ నుంచి జానంపేట ఒక్కటే ఎంపికైందని కేంద్ర సంస్కృతి, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ లోక్‌‌‌‌‌‌‌‌సభలో వెల్లడించారు. 

ప్రస్తుతం గుజరాత్, హరియాణా, ఒడిశా, బిహార్, తమిళనాడుతో పాటు తెలంగాణలోని జానంపేటలో తవ్వకాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. 2021–25 మధ్య దేశవ్యాప్తంగా 121 పురాతత్వ తవ్వకాల ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చినట్లు వెల్లడించారు. ఈ తవ్వకాల్లో పురాతన నిర్మాణాల అవశేషాలు, సమాధులు, మట్టి పాత్రలు, నాణేలు, పూసలు, ఆభరణాలు, వ్యవసాయ పనిముట్లు లభిస్తున్నాయని, వాటిని శాస్త్రీయ పరీక్షల కోసం వివిధ ప్రయోగశాలలకు పంపుతున్నట్లు వివరించారు.