హైదరాబాద్, వెలుగు: తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా షూటింగ్ గేమ్ అభివృద్ధికి సమగ్ర కార్యాచరణ రూపొందించేందుకు తెలంగాణ రైఫిల్ అసోసియేషన్ (టీఆర్‌ఏ) 'మొట్ట మొదటి స్పోర్ట్స్ షూటింగ్ లీడర్‌షిప్ కాంక్లేవ్ ’ను సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించింది. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని టీఆర్‌ఏ హెడ్ ఆఫీస్ వేదికగా జరిగిన ఈ కాంక్లేవ్‌లో నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఆర్‌ఏఐ) ప్రెసిడెంట్ కలికేష్ నారాయణ్ సింగ్ డియో, టీఆర్‌ఏ ప్రెసిడెంట్ అమిత్ సంఘీ, స్టార్ షూటర్ ఇషా సింగ్, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు,క్రీడా నిర్వాహకులు పాల్గొని ఇండియన్ షూటింగ్ భవిష్యత్తుపై చర్చించారు.
క్రీడకు ప్రాచుర్యం కల్పించేందుకు, స్పాన్సర్లను ఆకర్షించేందుకు ఏర్పాటు చేయబోతున్న ‘షూటింగ్ ప్రీమియర్ లీగ్’పై చర్చించారు. షూటర్ల కోసం ప్రత్యేకంగా మొబైల్ యాప్, వెబ్‌సైట్, ట్రిగ్గర్ పాయింట్ అనే డిజిటల్ మ్యాగజైన్‌ను అందుబాటులోకి తెస్తున్నట్టు టీఆర్‌ఏ ప్రెసిడెంట్ అమిత్ సంఘీ తెలిపారు. గచ్చిబౌలి షూటింగ్ రేంజ్‌ను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. 2032 నాటికి తెలంగాణ నుంచి 2--–3 ఒలింపియన్లను తయారు చేయడమే లక్ష్యమని రాష్ట్ర క్రీడా శాఖ సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి పేర్కొన్నారు.
