జనగామ, వెలుగు: ఏప్రిల్లో రెండో విడత ఇందిరమ్మ ఇండ్లు మంజూరవుతాయని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. ఈ విడతలో ఇంటి స్థలం లేని వారికి స్థలం ఇవ్వడంతోపాటు ఇండ్లు మంజూరు చేస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలపై గురువారం ఆయన రివ్యూ నిర్వహించారు. ఒక్క ఇందిరమ్మ ఇల్లు కూడా ల్యాప్స్కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
గతంలో ఇండ్ల నిర్మాణం కోసం ఎక్కడెక్కడ భూ సేకరణ జరిగిందో గుర్తించాలని చెప్పారు. ఒక ఎకరంలో ఎంత మందికి స్థలం ఇవ్వవచ్చో మార్చి 15 లోగా నివేదిక ఇవ్వాలని సూచించారు. మార్చి చివరి వరకు కూడా వ్యవసాయానికి నీరు ఇవ్వాల్సి ఉంటుందని, కాలువల్లో పూడికతీత కోసం ఎస్డీఎఫ్ నుంచి రూ.5 లక్షలు మంజూరు చేస్తానని పేర్కొన్నారు. మార్చి 21 వరకు ఈజీఎస్పనులను పూర్తి చేయాలని చెప్పారు. కలెక్టర్రిజ్వాన్బాషా షేక్, అడిషనల్ కలెక్టర్ పింకేశ్కుమార్ ఉన్నారు.
