న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో అరుదైన రికార్డు సృష్టించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయన ఫాలోవర్ల సంఖ్య 10 కోట్ల మార్కును దాటింది. ఈ ఘనత సాధించిన ప్రపంచంలోని మొట్టమొదటి రాజకీయ నాయకుడు, దేశాధినేతగా మోదీ సరికొత్త చరిత్ర లిఖించారు.
ప్రధాని మోదీ ఇన్‌స్టాగ్రామ్‌లోకి 2014లో ఎంట్రీ ఇచ్చారు. గత పదేండ్లలో తన ఫాలోవర్ల సంఖ్యను విపరీతంగా పెంచుకున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పోలిస్తే ప్రధాని మోదీకి రెట్టింపు కంటే ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్నారు.
