- మోదీకి కిషన్ రెడ్డి కృతజ్ఞతలు
న్యూఢిల్లీ, వెలుగు: సర్వైకల్ క్యాన్సర్ ముప్పు నుంచి బాలికలను రక్షించేందుకు అందించే ఉచిత హెచ్‌పీవీ టీకా పంపిణీకి కేంద్రం శ్రీకారం చుట్టిందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. దేశ భవిష్యత్తును నిర్మించే మన ఆడబిడ్డల ఆరోగ్యం విషయంలో ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నదని చెప్పారు.
ఈ టీకా పంపిణీ శనివారం నుంచి అన్ని ఆరోగ్య కేంద్రాలలో ప్రారంభం కానుందని పేర్కొన్నారు. 14 నుంచి 15 ఏండ్ల లోపు బాలికలకు రాష్టంలో 3.30 లక్షల మందికి టీకా పంపిణీ చేయనున్నట్టు వెల్లడించారు. రాబోయే తరాలను ప్రాణాంతక వ్యాధుల నుంచి కాపాడుతున్న ప్రధానికి కిషన్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
