దుబాయ్ గజగజలాడింది. వణికిపోయింది. 2026, ఆగస్ట్ 5వ తేదీ ఉదయం ఈ పేలుళ్లు జరిగినట్లు చెబుతోంది దుబాయ్ ప్రభుత్వం. జెబెల్ అలీ ఇండస్ట్రీయల్ ప్రాంతంలో జరిగిన ఈ పేలుళ్ల వెనక ఇరాన్ దాడి చేసిందా లేక.. మరో కారణం ఏమైనా ఉందా అనే విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు దుబాయ్. పేలుళ్ల తర్వాత జెబెల్ అలీ ఇండస్ట్రీయల్ ఏరియాలోని ఆకాశంలో దట్టమైన పొగలు కమ్మేశాయి. మంటలు ఎగసిపడ్డాయి. ఈ పేలుళ్లకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.......
దుబాయ్‌లోని జెబెల్ అలీ ఇండస్ట్రియల్ ఏరియాలో కేవలం 20 నిమిషాల వ్యవధిలోనే కనీసం 7 సార్లు పేలుళ్లు వినిపించాయని ఇరాన్‌కు చెందిన 'మెహర్' వార్తా సంస్థ తెలిపింది. దీనికి సంబంధించి ఆకాశంలో దట్టమైన పొగ అలుముకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ పేలుళ్లు ఎందుకు జరిగాయి అనేదానిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇది పారిశ్రామిక ప్రమాదమా లేక శత్రువుల దాడా అనే విషయం ఇంకా తేలాల్సి ఉంది. ఈ ఘటనలో ప్రాణనష్టం జరిగిందా లేదా ఆస్తీ నష్టం ఎంత అనే వివరాలు ఇంకా తెలియరాలేదు.
DUBAI — Sebuah ledakan mengguncang Kawasan Industri Jebel Ali di selatan Dubai, Uni Emirat Arab (UEA). Insiden tersebut memicu kepulan asap pekat yang membubung ke udara dan terlihat dari beberapa titik kota.
— SW News - SOFT WAR NEWS (@SoftWarNews) August 5, 2026
Menurut laporan di lokasi kejadian, sedikitnya tujuh suara ledakan… pic.twitter.com/ev0qR4z6H8
ఈ పేలుళ్లకు సంబంధించిన వీడియోలు తీశారనే ఆరోపణలతో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
క్షిపణి దాడి ప్రచారం:
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు నడుస్తున్న తరుణంలో... యెమెన్ నుంచి యూఏఈ (UAE) పై మిస్సైల్ దాడి జరిగి ఉండవచ్చని కొన్ని ఇరాకీ వార్తా సంస్థలు ప్రచారం చేస్తున్నాయి. అయితే, అధికారికంగా యూఏఈ మీడియా దీనిని ధృవీకరించలేదు. ఈ పేలుళ్లకు, క్షిపణి దాడికి సంబంధం ఉందా లేదా అనే దానిపై స్పష్టత లేదు.
IRAN STRIKES UAE!
— رضوانہ (@Rizvana_Raza) August 5, 2026
EXPLOSIONS Tuesday night in the port of Jebel Ali, 35 km (22 miles) southwest of Dubai, United Arab Emirates, along the Persian Gulf.#Irán #UAE pic.twitter.com/YVaEgmmIVv
