Hey Balwanth: కలెక్షన్ల కష్టాలకు చెక్.. 10 కోట్ల బడ్జెట్ రికవరీ.. ‘హే బల్‌వంత్’తో సుహాస్ రిలీఫ్

Hey Balwanth: కలెక్షన్ల కష్టాలకు చెక్.. 10 కోట్ల బడ్జెట్ రికవరీ.. ‘హే బల్‌వంత్’తో సుహాస్ రిలీఫ్

సుహాస్, శివానీ నాగారం జంటగా గోపీ అచ్చర దర్శకత్వంలో బి.నరేంద్ర రెడ్డి నిర్మించిన చిత్రం ‘హే బల్‌‌వంత్’. బన్నీవాస్‌‌, వంశీ నందిపాటి ఈనెల 20న థియేటర్స్‌‌లో విడుదల చేశారు. ఈ నేపథ్యంలో గురువారం సక్సెస్‌‌ మీట్ నిర్వహించారు.

సుహాస్ మాట్లాడుతూ ‘‘అంబాజీ పేట’  సినిమా తర్వాత నా సినిమాల కలెక్షన్లు మినిమమ్‌‌ నెంబర్లు కూడా కనబడకపోవడంతో భయమేసింది. ఈ సినిమా వసూళ్లు చూసి మళ్లీ ధైర్యం వచ్చింది. ఓవర్‌‌‌‌సీస్‌‌లో కూడా మంచి కలెక్షన్లు వచ్చాయి. ఓటీటీలో కూడా మంచి ఫ్యాన్సీ రేటు వచ్చింది’ అని చెప్పాడు.

ఈ సక్సెస్‌‌ను అందించిన అందరికీ హీరోయిన్ శివానీతో పాటు దర్శకనిర్మాతలు థ్యాంక్స్ చెప్పారు. వంశీ నందిపాటి మాట్లాడుతూ ‘ఈ సినిమా బ్రేక్‌‌ ఈవెన్‌‌ కావడం ఎంతో హ్యాపీనెస్‌‌ ఇచ్చింది.

దాదాపు 10 కోట్ల బడ్జెట్‌‌తో దీన్ని నిర్మించాం. ఓటీటీ, శాటిలైట్‌‌ ఇతర హక్కులు, థియేటర్స్‌‌ కలెక్షన్స్‌‌ అన్ని కలిసి ఆ పది కోట్లు పెట్టుబడి సాధించాం. ముఖ్యంగా యూఎస్‌‌లో మంచి వసూళ్లు వచ్చాయి. రానున్న రోజుల్లో ప్రాఫిట్స్‌‌ జోన్‌‌లోకి వెళతాం’ అని అన్నారు.