ఆర్టీసీలో యూనియన్లను పునరుద్ధరించండి : ఐఎన్టీయూసీ

ఆర్టీసీలో యూనియన్లను  పునరుద్ధరించండి :  ఐఎన్టీయూసీ
  • లేకపోతే సహాయనిరాకరణకు దిగుతాం: ఐఎన్టీయూసీ 

హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీలో ఈ నెల 31లోపు యూనియన్లను పునరుద్ధరించకపోతే యాజమాన్యానికి సహాయ నిరాకరణ తప్పదని స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ (ఐఎన్టీయూసీ) ప్రధాన కార్యదర్శి కొమిరెల్లి రాజిరెడ్డి అల్టిమేటం జారీ చేశారు. వచ్చే ఏడాది జనవరి1 నుంచి విధుల్లో నిరసన తెలియజేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ఇకపై ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రా డ్యూటీలు, వీక్లీ ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లు, స్పెషల్ ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ల రోజుల్లో డ్యూటీలు చేయొద్దని సూచించారు.