SMAT 2025: కిషాన్ vs చాహల్.. నేడు (డిసెంబర్ 18) ముస్తాక్ అలీ ట్రోఫీ ఫైనల్.. లైవ్ స్ట్రీమింగ్ ఎందులో చూడాలంటే..?

SMAT 2025: కిషాన్ vs చాహల్.. నేడు (డిసెంబర్ 18) ముస్తాక్ అలీ ట్రోఫీ ఫైనల్.. లైవ్ స్ట్రీమింగ్ ఎందులో చూడాలంటే..?

ఇండియన్ డొమెస్టిక్ టీ20 ఫార్మాట్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఫైనల్ కు రంగం సిద్ధమైంది. టోర్నీ మొత్తం అద్భుతంగా ఆడిన జార్ఖండ్, హర్యానా జట్లు టైటిల్ కోసం అమీతుమీ తేల్చుకోనున్నాయి. గురువారం (డిసెంబర్ 18) పూణే వేదికగా మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఈ మెగా ఫైనల్ జరగనుంది. ముంబై, కర్ణాటక, తమిళనాడు లాంటి కాకుండా జార్ఖండ్, హర్యానా ఫైనల్లో తలపడడం ఆసక్తికరంగా మారింది. రెండు జట్లు కూడా పటిష్టంగా ఉండడంతో ఫైనల్ హోరాహోరీగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

జార్ఖండ్, హర్యానా రెండు జట్లు కూడా వారి వారి గ్రూప్ లలో అగ్రస్థానంలో నిలిచి ఫైనల్ కు అర్హత సాధించాయి. ఈ మ్యాచ్ లో అందరి దృష్టి టీమిండియా వికెట్ కీపర్ ఇషాన్ కిషాన్, స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ పైనే ఉంది. కిషాన్ జార్ఖండ్ జట్టుకు.. చాహల్ హర్యానా జట్టుకు ఆడనున్నారు. అంకిత్ కుమార్ హర్యానా జట్టును లీడ్ చేయనున్నాడు. మరోవైపు ఇషాన్ కిషన్ జార్ఖండ్ జట్టుకు కెప్టెన్సీ చేయనున్నాడు. విరాట్ సింగ్, కుమార్ కుషాగ్రా,నిశాంత్ సింధు,అన్షుల్ కాంబోజ్ లాంటి ప్లేయర్స్ ఎలా రాణిస్తారో ఆసక్తికరంగా మారింది.   మ్యాచ్ సాయంత్రం 4;30 గంటలకు ప్రారంభమవుతోంది.          

సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ 2025 ఫైనల్ లైవ్ స్ట్రీమింగ్ వివరాలు:

జార్ఖండ్ vs హర్యానా ఫైనల్ మ్యాచ్ లైవ్ టెలికాస్టింగ్ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో అందుబాటులో ఉంటుంది.

లైవ్ స్ట్రీమింగ్ జియో హాట్ స్టార్, వెబ్‌సైట్‌లో చూడొచ్చు. 

స్క్వాడ్‌లు:

జార్ఖండ్:

ఇషాన్ కిషన్ (కెప్టెన్, వికెట్ కీపర్), విరాట్ సింగ్, కుమార్ కుషాగ్రా, రాబిన్ మింజ్, అనుకుల్ రాయ్, పంకజ్ కుమార్, రాజన్‌దీప్ సింగ్, బాల్ కృష్ణ, వికాష్ సింగ్, సుశాంత్ మిశ్రా, సౌరభ్ శేఖర్, అమిత్ కుమార్, ఉత్కర్ష్ సింగ్

హర్యానా:

అర్ష్ రంగ, అంకిత్ కుమార్ (కెప్టెన్), నిశాంత్ సింధు, ఆశిష్ సివాచ్, యశ్వర్ధన్ దలాల్ (వికెట్ కీపర్), సమంత్ జఖర్, పార్త్ వాట్స్, సుమిత్ కుమార్, అన్షుల్ కాంబోజ్, అమిత్ రాణా, ఇషాంత్ భరద్వాజ్, వివేక్ నరేష్ కుమార్, అనుజ్ థక్రాల్, అర్పిత్ సింగ్ రాణా, భువన్ రొహ్దిల్లా, మయాంక్ సంధిల్య, యువరాజ్ యోగిందర్ సింగ్, యుజ్వేంద్ర చాహల్