బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 514 ఉద్యోగాలు: డిగ్రీ పాసైనోళ్లు అర్హులు.. 5 జనవరి లాస్ట్ డేట్..

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 514 ఉద్యోగాలు: డిగ్రీ పాసైనోళ్లు అర్హులు.. 5 జనవరి లాస్ట్ డేట్..

నిరుద్యోగులు, బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారి గుడ్ న్యూస్. బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI)  2025-26 ఏడాదికి  'క్రెడిట్ ఆఫీసర్' పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 514 ఖాళీ పోస్టులు ఉన్నాయి. అర్హత, అనుభవం ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రారంభం: 20 డిసెంబర్ 2025

చివరి తేదీ:  5 జనవరి 2026

ఖాళీల వివరాలు:
మొత్తం 514 పోస్టులను మూడు రకాలుగా విభజించారు:
*మిడ్ లెవెల్  (MMGS-II): 418 పోస్టులు
*మిడ్-సీనియర్ లెవెల్  (MMGS-III): 60 పోస్టులు
*సీనియర్ మేనేజ్‌మెంట్ (SMGS-IV): 36 పోస్టులు

అర్హతలు:
ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ పాసై ఉండాలి. MBA (ఫైనాన్స్), CA, ICWA లేదా బ్యాంకింగ్‌లో పీజీ చేసిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.

 వయస్సు:
మిడ్ లెవెల్: 25 నుండి 35 ఏళ్ల లోపు ఉండాలి.
మిడ్-సీనియర్ లెవెల్  : 28 నుండి 38 ఏళ్ల లోపు ఉండాలి.
సీనియర్ మేనేజ్‌మెంట్: 30 నుండి 40 ఏళ్ల లోపు ఉండాలి.
(SC/STలకు 5 ఏళ్లు, OBCలకు 3 ఏళ్ల వయో సడలింపు ఉంటుంది).

 అనుభవం:
కనీసం 3 నుంచి 8 ఏళ్ల వరకు బ్యాంకింగ్ రంగంలో పని చేసిన అనుభవం ఉండాలి. ముఖ్యంగా క్రెడిట్ విభాగంలో 

ఎంపిక విధానం:
అభ్యర్థులను రెండు పద్ధతుల్లో ఎంపిక చేస్తారు. అభ్యర్థుల నాలెడ్జ్ చెక్ చేయడానికి ఆన్‌లైన్ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో పాసైన వారికి వ్యక్తిగత ఇంటర్వ్యూ ఉంటుంది.

దరఖాస్తు చేసుకోవడం ఎలా:
 *ముందుగా బ్యాంక్ అఫీషియల్ వెబ్‌సైట్ bankofindia.bank.inకి వెళ్లండి.
*ఇప్పుడు 'Careers' విభాగంలోకి వెళ్లి, క్రెడిట్ ఆఫీసర్ నోటిఫికేషన్‌ను క్లిక్ చేయండి.
*'Apply Online' మీద క్లిక్ చేసి మీ వివరాలు పేరు, చదువు, అనుభవం ఎంటర్ చేయండి. 
* ఇప్పుడు మీ ఫోటో, సంతకం, అవసరమైన సర్టిఫికేట్లను అప్‌లోడ్ చేయండి.
*ఫీజు చెల్లించి, దరఖాస్తు ఫార్మ్ సబ్మిట్ చేయండి.
*చివరగా ఒక కాపీని ప్రింట్ తీసుకుని మీ దగ్గర పెట్టుకోండి.