ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్ (ఐఐటీ హైదరాబాద్) ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ సమర్పించడానికి చివరి తేదీ ఫిబ్రవరి 13.
ఖాళీలు: 04. (ప్రాజెక్ట్ అసోసియేట్ 03, ప్రాజెక్ట్ అటెండెంట్ 01).
ఎలిజిబిలిటీ
ప్రాజెక్ట్ అసోసియేట్: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో బి.టెక్‌తోపాటు కంప్యూటర్ అప్లికేషన్స్‌లో మంచి పరిజ్ఞానం ఉండాలి. అకౌంట్స్, హెచ్ఆర్ కార్యకలాపాలను నిర్వహించడంలో కనీసం ఏడాది పని అనుభవం ఉండాలి.
ప్రాజెక్ట్ అటెండెంట్: గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉండాలి.
ఫైళ్లు, రికార్డుల నిర్వహణ, పత్రాల స్కానింగ్, డాక్ నిర్వహణకు సంబంధించిన ఏదైనా ఐఐటీలో పనిచేసిన అనుభవం ఉండాలి. కంప్యూటర్ అప్లికేషన్స్‌లో మంచి పరిజ్ఞానం ఉండాలి.
గరిష్ట వయోపరిమితి: 40 ఏండ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్‌లిస్ట్, రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు iith.ac.in. వెబ్‌సైట్‌ను సందర్శించండి.
