యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్), ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్), ఇండియన్ ఫారిన్ సర్వీస్ (ఐఎఫ్ఎస్)తో సహా సివిల్ సర్వీసెస్ గ్రూప్ A , గ్రూప్ B సర్వీసుల్లో నియామకాల కోసం సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2026కు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ సమర్పించడానికి చివరి తేదీ ఫిబ్రవరి 24.
ఖాళీలు: 933.
సర్వీస్ క్యాటగిరీలు: ఆల్ ఇండియా సర్వీసులు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, కేంద్ర సర్వీసులు గ్రూప్–ఏ ఐఆర్ఎస్, ఇండియన్ రైల్వే మేనేజ్ మెంట్, ఇండియన్ డిఫెన్స్ అకౌంట్స్,
ఇండియన్ పోస్టల్ సర్వీస్, ఇతర సర్వీసులు, సెంట్రల్ సర్వీస్ గ్రూప్–బీ డీఏఎన్ఐసీఎస్, డీఏఎన్ఐపీఎస్, ఏఎఫ్ హెచ్ క్యూ సివిల్ సర్వీస్/ పీఓఎన్డీఐసీఎస్.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి: కనీస వయసు 21, గరిష్ట వయసు 32. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 ఏండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: ఫిబ్రవరి 4
అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.100. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మహిళా అభ్యర్థులకు మినహాయింపు ఉంటుంది.
లాస్ట్ డేట్: ఫిబ్రవరి 24.
సెలెక్షన్ ప్రాసెస్: ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ (ఆబ్జెక్టివ్), మెయిన్ ఎగ్జామినేషన్ (డిస్క్రిప్టివ్), ఇంటర్వ్యూ/ పర్సనాలిటీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ప్రిలిమినరీ ఎగ్జామ్ తేదీ: 2026, మే 26.
పూర్తి వివరాలకు www.upsc.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించండి.
ప్రిలిమినరీ ఎగ్జామ్
సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష అనేది యూపీఎస్సీ ఎంపిక ప్రక్రియలో మొదటి దశ. ఇది మెయిన్ పరీక్ష కోసం అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేయడానికి ఉపయోగించే ఒక స్క్రీనింగ్ పరీక్ష. ప్రిలిమ్స్‌లో సాధించిన మార్కులను తుది మెరిట్ ర్యాంకింగ్‌లో పరిగణనలోకి తీసుకోరు. ప్రిలిమినరీ ఎగ్జామ్‌లో రెండు పేపర్లు ఉంటాయి. ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ రూపంలో ఇస్తారు. పేపర్–II పూర్తిగా అర్హత పరీక్ష మాత్రమే. ఇందులో అర్హత సాధించాలంటే కనీసం 33 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. పేపర్–Iలో సాధించిన మార్కులను కటాఫ్, మెయిన్స్ కోసం షార్ట్‌లిస్టింగ్ చేయడానికి పరిగణిస్తారు. నెగెటివ్ మార్కులు ఉన్నాయి. ప్రతి తప్పుడు సమాధానానికి 1/3వ వంతు మార్కులు కోత విధిస్తారు.
మెయిన్ ఎగ్జామ్
మెయిన్ ఎగ్జామ్‌లో మొత్తం 9 పేపర్లు ఉంటాయి. ఇందులో రెండు పేపర్లు అయిన భారతీయ భాష, ఇంగ్లిష్ పూర్తిగా అర్హత పరీక్షలు మాత్రమే. వీటిలో సాధించిన మార్కులను తుది ఎంపికలో పరిగణనలోకి తీసుకోరు. మిగతా ఏడు పేపర్లు ఆధారంగా మెరిట్‌ను నిర్ధారిస్తారు. ఒక్కో పేపర్ 250 మార్కులకు మొత్తం 1750 మార్కులకు మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది. ఇంటర్వ్యూ/ పర్సనాలిటీ టెస్ట్ 275 మార్కులకు ఉంటుంది.
తుది మెరిట్ లెక్కింపు
- రాత పరీక్ష మార్కులు 1750.
- ఇంటర్వ్యూ మార్కులు 275.
- మొత్తం మార్కులు 2025
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్ సీ) ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
అప్లికేషన్ సమర్పించడానికి చివరి తేదీ ఫిబ్రవరి 24.
ఖాళీలు: 80 (ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్).
క్యాటగిరీల వారీగా ఖాళీలు: అన్రిజర్వ్డ్ 33, ఓబీసీ 21, ఎస్సీ, 12, ఎస్టీ 06, ఈడబ్ల్యూఎస్ 08.
ఎలిజిబిలిటీ: వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం, రసాయనశాస్త్రం, భౌతికశాస్త్రం, గణితం, గణాంకాలు, భూగర్భశాస్త్రం, వ్యవసాయం, అటవీశాస్త్రం, పశుసంవర్ధకం & పశువైద్యశాస్త్రం ఒక సబ్జెక్టుగా బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.
వయోపరిమితి: కనీస వయసు 21, గరిష్ట వయసు 32. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 ఏండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: ఫిబ్రవరి 4
అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.100. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మహిళా అభ్యర్థులకు మినహాయింపు ఉంటుంది.
లాస్ట్ డేట్: ఫిబ్రవరి 24.
సెలెక్షన్ ప్రాసెస్: సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ (ఆబ్జెక్టివ్), ఇండియన్ ఫారెస్ట్ మెయిన్ ఎగ్జామినేషన్ (డిస్క్రిప్టివ్), ఇంటర్వ్యూ/ పర్సనాలిటీ టెస్ట్, మెడికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
సివిల్ సర్వీసులకు, ఇండియన్ ఫారెస్ట్ సర్వీసులకు ఒకే ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది.
మెయిన్ ఎగ్జామ్‌లో మొత్తం ఆరు పేపర్లు ఉంటాయి. ఇందులో ప్రశ్నలకు సమాధానాలు వ్యాస రూపంలో రాయాల్సి ఉంటుంది. జనరల్ ఇంగ్లిష్ 300 మార్కులకు, జనరల్ నాలెడ్జ్ 300 మార్కులకు ఉంటుంది. మిగిలిన నాలుగు పేపర్లు ఆప్షనల్ సబ్జెక్టులు. ఒక్కో పేపర్‌కు 200 మార్కులు. మెయిన్ ఎగ్జామ్ మొత్తం 1100 మార్కులకు నిర్వహిస్తారు. పర్సనల్ ఇంటర్వ్యూ 300 మార్కులకు ఉంటుంది. మొత్తం 1400 మార్కులకు ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
