ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం, హైదరాబాద్ యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ సమర్పించడానికి చివరి తేదీ ఫిబ్రవరి 10.
ఖాళీలు: 01 (యంగ్ ప్రొఫెషనల్స్).
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత విభాగంలో ఏడాది అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు.
గరిష్ట వయోపరిమితి: 40 ఏండ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్‌లిస్ట్, రాతపరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు www.mea.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించండి.
