అరే ఏంట్రా ఇది.. అది బైక్ రా.. ఆటో కాదు.. మీ వయస్సు ఏంటి.. బండిపై ఏడుగురు ఏంట్రా..!

అరే ఏంట్రా ఇది.. అది బైక్ రా.. ఆటో కాదు.. మీ వయస్సు ఏంటి.. బండిపై ఏడుగురు ఏంట్రా..!

బైక్ అంటే ఇద్దరు లేదా ముగ్గురు.. ఇంత వరకు ఒకే.. ఏడుగురు అంటే.. ఒక బైక్ పై ఏడుగురా అని ఆశ్చర్యపోవచ్చు.. ఈ కుర్రోళ్లు మాత్రం దీన్ని చేసి చూపించారు. ఆటోలో కూడా నలుగురు లేదా ఐదుగురు.. అంతకు మించితే అది ట్రాక్టర్ లేదా వ్యాన్ అవుతుంది. ఇలాంటి ఇన్సిడెంట్ ఒక మన రోడ్లపై కనిపించింది. ఒక బైక్ ఏడుగురు యువకులు ఎక్కి.. ఎంతో దర్జాగా.. కేకలు వేసుకుంటూ.. అరుపులతో రోడ్లపై చక్కర్లు కొడుతున్న వీడియో వైరల్ అవుతుంది. 

మహారాష్ట్ర రాష్ట్రం.. ముంబై సిటీలోని సాకినాకా ఏరియా. సాయంత్రం సమయంలో ఫుల్ రద్దీ. ఈ ఏరియాలో ఓ బైక్ పై ఏడుగురు యువకులు ఎక్కి వెళ్లటం కనిపించింది. అదేమన్నా పెద్ద బండా అంటే.. హోండా బైక్. ముగ్గురు ఎక్కితేనే కుయ్యోమోర్రో అంటోంది. అలాంటి బైక్ పై ఏడుగురు ఎక్కి వెళ్లటం కనిపించింది. ఈ ఫొటోలు, వీడియోలను కొంత మంది వాహనదారులు షూట్ చేసి.. ముంబై ట్రాఫిక్ పోలీసులకు ట్యాగ్ చేయటంతో వెలుగులోకి వచ్చింది. 

ఇంతకీ బైక్ నెంబర్ ఎంత అంటారా.. MH 03 EY 3649. వీళ్లకు ట్రాఫిక్ పోలీసులు అంటే భయం లేదు.. వాళ్ల ప్రాణాలపై వాళ్లకే భయం లేదు.. ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారేంట్రా మీరు అంటూ నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ఇలాంటి ఆలోచన ఎలా వచ్చింది.. ఇంత మంది ఆ బైక్ పై ఎలా ఎక్కారు.. అసలు ఆ బైక్ డ్రైవ్ చేస్తుంది ఎవరు.. బైక్ నడిపేవాడు ఎవడు అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. 

ఒక బైక్ పై ఏడుగురు ఎక్కినా కూడా వేగంగా నడపటం.. నిర్లక్ష్యంగా నడపటం కనిపించిందని.. వీళ్లకు అస్సలు బాధ్యత అంటే ఏంటో తెలియదని.. పడితే దెబ్బలు తగులుతాయన్న స్పృహ ఉందా అంటూ మరికొంత మంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

వీళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని.. లేకపోతే ఇదే హీరోయిజం అనుకుని చాలా మంది ఫాలో అయ్యే ప్రమాదం ఉందని.. మిగతా వాళ్లు ఇలాగే ప్రయత్నించే ప్రమాదం ఉందంటూ మరికొందరు నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేయటం విశేషం. 

బైక్ ఏడుగురు యువకుల ఫొటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓవరాల్ గా వీళ్లపై యాక్షన్ గట్టిగానే తీసుకోవాలనే డిమాండ్లు ఎక్కువగా రావటంపై.. ముంబై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో.. ఎలాంటి ట్రీట్ మెంట్ ఇస్తారో చూడాలి.