- లోక్సభలో కేంద్రం వెల్లడి
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో రైల్వే ప్రాజె క్టుల కోసం ఇంకా 764 హెక్టార్లు (33%) భూసేకరణ జరగాల్సి ఉందని, దీనివల్ల పను లు ఆలస్యం అవుతున్నాయని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ముఖ్యంగా మనోహరాబాద్-–కొత్తపల్లి, కాజీపేట-–విజయవా డ లైన్లలో భూసేకరణ పెండింగ్‌లో ఉందని చెప్పారు. లోక్ సభలో ఎంపీ ఈటల రాజేందర్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి రాతపూర్వక సమాధానం ఇచ్చారు.
రాష్ట్రానికి ప్రస్తుతం రూ.35,045 కోట్ల విలువైన 20 రైల్వే ప్రాజెక్టు లు (6 కొత్త లైన్లు, 14 డబ్లింగ్ పనులు) మంజూరైనట్టు పేర్కొన్నారు. వికారాబాద్–-కృష్ణా, గద్వాల్-–డోర్నకల్, కాచిగూడ-–జగ్గయ్యపేట, పటాన్‌చెరు-–ఆదిలాబాద్, బోధన్-–లాతూర్ రోడ్, అక్కన్నపేట బైపాస్ మార్గాల డీపీఆర్ తయారీకి అనుమతి లభించిందన్నారు.
