తెలంగాణలో మాఫియా పాలన: నితిన్ నబీన్

తెలంగాణలో  మాఫియా పాలన:  నితిన్ నబీన్
  • కాంగ్రెస్ సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కమీషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రాజ్: నితిన్ నబీన్
  •     ప్రతి పనికీ, బిల్లుల మంజూరుకు ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్యాక్స్ విధిస్తున్నరు 
  •     బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోయిందనుకుంటే కాంగ్రెస్ దోపిడీ చేస్తున్నది
  •     మైనార్టీల ఓటు బ్యాంక్ కోసం వాళ్లను బుజ్జగిస్తున్నది 
  •     హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నా పట్టించుకోవడం లేదని ఫైర్   
  •     మహబూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బీజేపీ విజయ సంకల్ప సమ్మేళనం 

మహబూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్, వెలుగు: తెలంగాణలో మాఫియా పాలన నడుస్తున్నదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ మండిపడ్డారు. రాష్ట్రంలో ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్ (రేవంత్, రాహుల్) ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ‘‘తెలంగాణలో బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రజలు తిరస్కరించారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. కమీషన్​ రాజ్ నడుపుతున్నది. బీఆర్ఎస్​ దోపిడీ పోయిందనుకుంటే.. కాంగ్రెస్​దోపిడీ మొదలైంది. ప్రతి పనికీ, బిల్లుల మంజూరుకు కమీషన్లు వసూలు చేస్తున్నారు” అని ఫైర్ అయ్యారు. బుధవారం మహబూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్ జిల్లా కేంద్రంలోని​ఎంవీఎస్​ కాలేజీ గ్రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బీజేపీ విజయ సంకల్ప​ సమ్మేళనం నిర్వహించారు. దీనికి ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి బూత్​స్థాయి కార్యకర్తలు తరలివచ్చారు. ఈ సందర్భంగా వాళ్లను ఉద్దేశించి నితిన్ నబీన్ మాట్లాడారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కార్యకర్తలు పని చేయాలని ఆయన​ సూచించారు. ‘‘2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటింగ్​శాతం కొంత పెరిగింది. అదిపార్లమెంట్​ఎన్నికల నాటికి 30 నుంచి 35 శాతానికి చేరుకుంది. మున్సిపల్​ఎన్నికల్లో ప్రతి బూత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 5‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌0 శాతం ఓట్లు సాధించాలన్న లక్ష్యంతో పని చేయాలి. ఈ ఎన్నికల్లో బీజేపీ పోరాటం అధికారం కోసమో, కుర్చీ కోసమో కాదు.. తెలంగాణ గౌరవం కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం” అని చెప్పారు.


మైనార్టీల ఓట్ల కోసం కాంగ్రెస్​తాపత్రయ పడుతోందని నితిన్ నబీన్​విమర్శించారు. ‘‘సీఎం రేవంత్​రెడ్డి కొన్ని వర్గాలను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్​అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్​అనే వాదం వినిపిస్తున్నారు. ఇలా దిగజారి మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను విస్మరిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమానికి బడ్జెట్‌‌‌‌‌‌‌‌లో నిధులు తగ్గించి మైనార్టీలకు పెంచారు. కేంద్రం వక్ఫ్​బోర్డు చట్టాలను సవరించి, పారదర్శకంగా చట్టం తీసుకొస్తే.. దాన్ని కాంగ్రెస్ అడ్డుకుంది. తెలంగాణలో వక్ఫ్​బోర్డు ద్వారా రూ.లక్షల కోట్లు విలువ చేసే 77 వేల ఎకరాలను అప్పగించారు” అని మండిపడ్డారు. ‘‘తెలంగాణలో హిందూ పండుగలపై కాంగ్రెస్​ప్రభుత్వం ఆంక్షలు పెడుతోంది. రెండేళ్లుగా హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దేవాలయాల భూములు ఆక్రమించుకుంటున్నా చర్యలు తీసుకోవడం లేదు. దీన్ని బీజేపీ కార్యకర్తలు సహించరు.. దీటైన సమాధానం చెబుతారు” అని హెచ్చరించారు. కాంగ్రెస్ సర్కార్ రెండేళ్లుగా ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదన్నారు. ‘‘మహిళలకు నెలకు రూ.2,500, కల్యాణలక్ష్మి ద్వారా తులం బంగారం ఇస్తామని మోసం చేసింది. రైతులను, బడుగు, బలహీన వర్గాలు, ఓబీసీలను కూడా దగా చేసింది” అని మండిపడ్డారు.  

తెలంగాణకు అత్యధిక నిధులు.. 

తెలంగాణపై ప్రధాని మోదీకి చిత్తశుద్ధి ఉందని నితిన్​నబీన్​అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కేంద్ర బడ్జెట్‌‌‌‌లో తెలంగాణకు అత్యధికంగా నిధులు కేటాయించారని, రూ.5,450 కోట్లతో రైల్వే హైస్పీడ్​కారిడార్లు మంజూరు చేశారని తెలిపారు. నిజామాబాద్‌‌‌‌లో జాతీయ పసుపు బోర్డు, మెగా టెక్స్​టైల్​పార్క్, ఇండస్ర్టియల్​కారిడార్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. విశిష్ట సేవలు అందించిన తెలంగాణ వాసులకు పద్మ పురస్కారాలు అందించామన్నారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా మోదీకి ఆదరణ పెరుగుతోంది. యూరోపియన్​యూనియన్‌‌‌‌తో చేసుకున్న డీల్‌‌‌‌తో అమెరికానే తలవంచి దిగి వచ్చేలా చేశారు. మోదీ పాలనపై ప్రజలకు విశ్వాసం, నమ్మకం కలుగుతోంది. తెలంగాణ ప్రజలు కూడా మోదీకి అండగా నిలవాలి” అని కోరారు. సమ్మేళనంలో కేంద్రమంత్రి కిషన్​రెడ్డి, జాతీయ ఓబీసీ సెల్​ప్రెసిడెంట్​కె.లక్ష్మణ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, ఎంపీలు డీకే అరుణ, కొండా విశ్వేశ్వర్​రెడ్డి, మహారాష్ట్ర ఐటీ శాఖ మంత్రి ఆశిశ్, ఎమ్మెల్సీ ఏవీఎన్​రెడ్డి పాల్గొన్నారు