- 7, 8న ప్రచారంలో పాల్గొననున్న పవన్ కల్యాణ్
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొననున్నారు. ఇందుకు సంబంధించి జనసేన పార్టీ బుధవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 7,8 వ తేదీల్లో పవన్ కల్యాణ్ ప్రచారంలో పాల్గొంటారని తెలిపింది. బీజేపీ , జనసేన అభ్యర్థుల విజయం కోసం పవన్ కల్యాణ్ ప్రచారం చేస్తారని పేర్కొంది.
త్వరలో రూట్ మ్యాప్, షెడ్యూల్ విడుదల చేస్తామని చెప్పింది. రాష్ర్ట ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని, పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు, ఎన్డీయే అభ్యర్థుల విజయానికి ప్రచారంలో పాల్గొననున్నట్టు వెల్లడించింది.
