- అందరూ డాటా ఎంట్రీ , కంప్యూటర్ ఆపరేటర్లే
హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్ఎంసీ లో చాలా కాలంగా పని చేస్తున్న డాటా ఎంట్రీ ఆపరేటర్లు, కంప్యూటర్ ఆపరేటర్లను బదిలీ చేశారు. హెడ్ ఆఫీస్, జోనల్, సర్కిల్ ఆఫీసుల్లో కలిపి దాదాపు 400 మంది పని చేస్తుండగా, ఏండ్లుగా ఒకే పోస్టింగ్ లో ఉంటున్న డాటా ఎంట్రీ ఆపరేటర్లు, కంప్యూటర్ ఆపరేటర్లను బదిలీ చేయాలని కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఆదేశించారు.
దీంతో వీరిని మంగళ, బుధవారాల్లో వివిధ చోట్లకు బదిలీ చేశారు. అయితే, కొత్తగా కేటాయించిన స్థానాల్లో వెంటనే జాయిన్ కావాలని లేకపోతే విధుల్లోంచి తొలగిస్తామని కమిషనర్ హెచ్చరించారు. అవినీతికి పాల్పడుతున్నట్లు కమిషనర్ దృష్టికి రావడంతో బదిలీలు చేపట్టినట్లు సమాచారం.
