క్షమాపణ చెప్పను.. పృథ్వీరాజ్ చవాన్

క్షమాపణ చెప్పను.. పృథ్వీరాజ్ చవాన్

న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ పై తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పడానికి కాంగ్రెస్ సీనియర్ నేత, మహారాష్ట్ర మాజీ సీఎం పృథ్వీరాజ్ చవాన్ నిరాకరించారు. తాను తప్పుగా ఏమీ మాట్లాడలేదని, క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ఈమేరకు బుధవారం మీడియాతో ఆయన మాట్లాడారు. “నేను ఎలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేయలేదు. అందువల్ల నేను క్షమాపణ చెప్పాల్సిన అవసరంలేదు.

 ఇంతకు మించి నేనేమీ చెప్పను” అని తెలిపారు. బుధవారం పుణెలో జరిగిన ఓ కార్యక్రమంలో పృథ్వీరాజ్ చవాన్ ఆపరేషన్ సిందూర్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్ మొదటి రోజునే పాక్ దళాలు భారత సైనిక విమానాలను కూల్చేశాయని అన్నారు. దీంతో భారత వైమానిక దళం పూర్తిగా నేలమట్టమైందని పేర్కొన్నారు. 

ఈ వ్యాఖ్యలపై పెద్దఎత్తున రాజకీయ దుమారం రేగింది. ఇది సైన్యాన్ని అవమానించడమే కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్షణంగా మారిందని బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా మండిపడ్డారు.