- చివరి విడతకు పోటెత్తిన ఓటర్లు
- 80 శాతం దాటిన పోలింగ్
- ఉమ్మడి 6 జిల్లాల్లో 564 జీపీలు, 4,846 వార్డులు
- 34 జీపీల్లో సర్పంచులు, 792 వార్డుల్లో సభ్యులు ఏకగ్రీవం
వరంగల్, వెలుగు: ఓరుగల్లులో చివరి విడత పల్లె ఫైటింగ్ ప్రశాంతంగా ముగిసింది. అభ్యర్థులు తమ మెజార్టీ పెంచుకునేందుకు సిటీలోని ఓటర్లను సైతం పల్లెలకు పట్టుకొచ్చే ఏర్పాట్లు చేశారు. దీంతో ఉమ్మడి వరంగల్ ఆరు జిల్లాల్లో బుధవారం గ్రామీణ ఓటర్లు పోలింగ్ సెంటర్లకు కదలివచ్చారు.
మొత్తంగా 564 జీపీలు, 4,846 వార్డుల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా, 34 జీపీల్లో సర్పంచులు, 792 వార్డుల్లో సభ్యులు ఏకగ్రీవమయ్యారు. అధికారులు మిగతాచోట్ల ఎన్నికలు నిర్వహించారు. దీంతో ఉమ్మడి ఆరు జిల్లాల్లో ప్రతిచోటా 80 శాతం నుంచి 88 శాతం వరకు పోలింగ్ నమోదైంది. గెలిచిన సర్పంచులు, వార్డు మెంబర్లు రంగులు చల్లుకుంటూ సంబురాల్లో మునిగితేలారు.
