మోదీ నాయకత్వంలో రామరాజ్యం : ఎంపీ రఘునందన్ రావు

మోదీ నాయకత్వంలో  రామరాజ్యం : ఎంపీ రఘునందన్ రావు
  •      ఈజీఎస్​పేరు మార్పుపై ప్రతిపక్షాలది అనవసర రాద్ధాంతం: రఘునందన్ రావు

న్యూఢిల్లీ, వెలుగు: దేశంలో రామరాజ్యం రావాలని మహాత్మా గాంధీ కలలు కన్నార ని.. ప్రధాని మోదీ నేతృత్వంలో రామరాజ్యం ఏర్పాటు దిశగా దేశం నడుస్తోందని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. బుధవారం లోక్​సభలో "వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్ గార్ అండ్ ఏజేఈఈ వికా మిషన్ గ్రామీ ణ్(వీబీజీ రామ్​జీ)" బిల్లుపై చర్చలో ఆయన పాల్గొన్నారు. పని దినాల సంఖ్య, వేతనం కూడా మోదీ సర్కార్ పెంచిందని సభ దృష్టికి తెచ్చారు. కానీ, పేరు మార్పుపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని ఫైర్ అయ్యారు. 2005 లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. 

అయితే, 2014 నుంచి ఉపాధితో పాటు దేశంలో ఎన్నో రంగాలు అభివృద్ధి పథంలో నడుస్తున్నాయన్నారు. ‘‘20 సంవత్సరాల తర్వాత పథకం సమీక్ష చేస్తే తప్పా? 2005లో పథకం ప్రారంభమైంది. 25 శాతం ఉన్న పేదరికం మోదీ నేతృత్వంలో 4.86 శాతం కు పడిపోయింది. యూపీఏ హయాంతో పోలిస్తే ఉపాధి హామీ పథకంలో మహిళకు అవకాశం పెరిగింది’’ అని చెప్పారు.