- యూపీ నుంచి భిక్షాటనకు వచ్చిన కుటుంబంలో విషాదం
ఓల్డ్‌సిటీ, వెలుగు : యూపీ నుంచి భిక్షాటనకు వచ్చిన ఓ కుటుంబం కారు ప్రమాదంలో ఏడాదిన్నర బిడ్డను పోగొట్టుకున్నది. ఈ విషాదకర ఘటన హైదరాబాద్మీర్చౌక్పోలీస్స్టేషన్పరిధిలో సోమవారం జరిగింది. రంజాన్ మాసంలో భిక్షాటన కోసం యూపీ నుంచి నిషా కుమారి అనే మహిళ తన పిల్లలతో వచ్చింది.
తన ఏడాదిన్నర కొడుకుతో కలిసి ఎంజీబీఎస్ బస్ డిపో ప్రాంతంలో భిక్షాటన చేస్తూ అక్కడే ఉన్న ఫుట్‌పాత్‌పై ఉంటోంది. సోమవారం అరుణ్ ఫుట్పాత్పక్కన ఆడుకుంటూ ఉండగా రోడ్డుపై వెళ్తున్న కారు కింద పడ్డాడు. తీవ్రంగా గాయపడిన బాలుడు అక్కడికక్కడే చనిపోయాడు. మీర్ చౌక్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
