బాసర, వెలుగు: భవిష్యత్ ఇంజనీర్ల వేదికగా బాసర ట్రిపుల్ ఐటీ నిలుస్తుందని వర్సిటీ వీసీ గోవర్ధన్ అన్నారు. అంతప్రజ్ఞలో భాగంగా సోమవారం కెమికల్ ఇంజినీరింగ్, మెటలార్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్ విభాగాలు సంయుక్తంగా ప్రాజెక్ట్ ఎక్స్‌పోను నిర్వహించాయి. ఈ ప్రదర్శనలో విద్యార్థులు వివిధ ప్రాజెక్టులను ప్రదర్శించారు. వ్యవసాయ వ్యర్థాలను ఉపయోగించి పర్యావరణానికి అనుకూలమైన శుభ్రపరిచే పదార్థాన్ని తయారు చేసే హస్క్ ఆధారిత డిటర్జెంట్, సంప్రదాయ ప్లాస్టిక్‌కు ప్ర త్యామ్నాయంగా రూపొందించిన బయోప్లాస్టిక్, తక్కువ ఖర్చుతో సమ ర్థవంతంగా నీటిని శుద్ధి చేసే వాటర్ ఫిల్ట్రేషన్ సిస్టమ్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
మెకానికల్ ఇంజినీరింగ్ విభాగం నిర్వహించిన ఆటో ఎక్స్‌పో కూడా సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంది. ఆటోమొబైల్ మోడళ్లు, ఇంజినీరింగ్ నమూనాలు, మెకానికల్ డిజైన్, ఆటోమోటివ్ ఆవిష్కరణలపై అవగా హన కల్పించారు. ప్రదర్శనలను వీసీ గోవర్ధన్, ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ ప్రొఫెసర్ మురళీ దర్శన్ సందర్శిం చారు. కార్యక్రమానికి అంతఃప్రజ్ఞ ఫ్యాకల్టీ కన్వీనర్ జంగలే స్వప్నిల్, ఇతర అధ్యాపకులు, విద్యార్థులు హాజరయ్యారు.
