బీజేపీ కుట్రలపై సంగారెడ్డిలో సభ : కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి

బీజేపీ కుట్రలపై సంగారెడ్డిలో సభ : కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి
  •     గాంధీ కుటుంబ చరిత్రనూ జనానికి చెప్తం: జగ్గారెడ్డి

హైదరాబాద్, వెలుగు: గాంధీ కుటుంబంపై బీజేపీ చేస్తున్న కుట్రలను వివరించేందుకు సంగారెడ్డిలో లక్ష మందితో వచ్చే నెలలో  భారీ సభను ఏర్పాటు చేస్తున్నట్టు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి తెలిపారు. బుధవారం గాంధీ భవన్ లో మీడియాతో ఆయన మాట్లాడారు. ఈ సభలో బీజేపీ వైఖరిని ఎండగడతామన్నారు. రాజకీయాల కోసం ఈ సభ పెట్టడం లేదని, గాంధీ కుటుంబ చరిత్ర జనానికి చెప్పడానికే ఈ సభ నిర్వహిస్తున్నామని జగ్గారెడ్డి వెల్లడించారు. 

గాంధీ, నెహ్రూ, ఇందిరా, రాజీవ్ గాంధీ ఈ దేశానికి చేసిన సేవలను ఈ సభలో సంగారెడ్డి ప్రజలకు వివరిస్తామన్నారు. ఉపాధి హామీ స్కీమ్ నుంచి గాంధీ పేరును కేంద్రం కుట్ర పూరితంగా వ్యవహరించి తీసేసిందని ఫైర్ అయ్యారు.